అక్కినేని నట వారసుడు.. నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో.. రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 22న ఈ సినిమా బిగ్ స్క్రీన్లపై సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజిబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అతడి మాటలు విన్న నెటిజనులు.. బ్రేకప్ వల్ల చై ఇంతలా బాధపడ్డాడా అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
థ్యాంక్ యూ మూవీలో నటించడానికి కారణం ఏంటని చైని ప్రశ్నించగా.. ఈ స్క్రిప్ట్ వినగానే తనలో ఓ ఫీలింగ్ వచ్చిందని.. తన జీవితంతలో స్పెషల్ పర్సన్స్‌కు థ్యాంక్స్ చెప్పాలనిపించిందని తెలిపాడు. ఆ ఫీలింగ్‌తో ఈ సినిమాలో నటించానని చెప్పాడు. కథ బాగుందని.. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ మూవీ వర్క్ చేస్తున్నందుకు తాను నటిస్తున్నట్లు రాశీ ఖన్నా చెప్పింది. ‘కరోనాలో నేను రోజు ఫోన్ చెక్ చేసుకునే వాడిని. సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉండేవాడిని. రోజు లేవడం తినడం.. సోషల్ మీడియాలో కామెంట్స్ చూసుకోవడం ఇదే జీవితమైంది. కరోనా ప్యాండమిక్ వల్ల నా మైండ్ సెట్ మారింది. మన లైఫే సోషల్ మీడియా అవ్వకూడదనే విషయం అర్థమైంది..’ అని చెప్పుకొచ్చాడు.
ఇక ఫస్ట్ లవ్ గురించి అడగ్గా.. అది బ్యూటీఫుల్ ఫీలింగ్ అని రాశీ ఖన్నా చెప్పింది. దీనిపై చై స్పందిస్తూ..తన ఫస్ట్ లవ్ తొమ్మిదో తరగతిలో జరిగిందని.. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసేవాళ్లమని నాగ చైతన్య గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి తమ హృదయాలను ముక్కలు చేసిందని.. ఆ తరువాత తాము ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామని తెలిపాడు నాగచైతన్య. ప్రసుత్తం అతడి కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.