బాలీవుడ్ లో గతేడాది సంచలనం సృష్టించిన అడల్ట్ ఫిలిమ్స్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త.. బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయగా.. రెండు నెలల్లోనే బెయిల్ పై బయటికి వచ్చాడు. అయితే.. ఈ కేసులో ముంబై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో రాజ్ కుంద్రా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.
మోడల్స్ ని, చిన్నపాటి హీరోయిన్లను బెదిరించి అశ్లీల వీడియోలు తీయడమేగాక.. యాప్ లో కూడా పోస్ట్ చేశాడనే ఆరోపణలను రాజ్ కుంద్రా ఎదుర్కొన్నారు. అలాగే డబ్బులు కూడా వసూల్ చేశాడని పలువురు తారలు బయటికి వచ్చి రాజు కుంద్రాపై ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాక్ష్యాలను కోర్టులో సమర్పించి కుంద్రాను అరెస్ట్ చేయగా.. ఇప్పుడు బెయిల్ పై బయటికి వచ్చి.. తనను బలిపశువును చేసి ఇందులో ఇరికించారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదే విషయంపై కుంద్రా తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ, “రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌కు వ్యతిరేకంగా మేము డిశ్చార్జ్ అప్లికేషన్ దరఖాస్తు చేశాము. ఛార్జిషీట్‌ను పరిశీలించిన తర్వాత, అందులో ఒక చిన్న సాక్ష్యం కూడా లేదని గమనించబడింది. కుంద్రాపై ఎలాంటి నేరాలు లేకపోగా.. కేసు మొత్తం ఊహాగానాలు, ఊహలపై ఆధారపడి ఉందని తేలింది. ఎలాంటి సాక్ష్యాలు లేనందున, కుంద్రాకు కోర్టు నుండి అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. వాదనలకు చివరి తేదీ సెప్టెంబర్ 8గా నిర్ణయించబడిందని పాటిల్ అన్నారు. ఇక కుంద్రా మాట్లాడుతూ.. తనను కావాలని ఈ వివాదంలో ఇరికించారని, తాను ఎలాంటి వీడియోలు అప్ లోడ్ చేయలేదని చెప్పాడు. అలాగే తాను ఎవరిని బెదిరించి డబ్బులు లాగలేదని.. తన వద్ద ఎవరి సీక్రెట్ కంటెంట్ లేదని చెప్పుకొచ్చాడు. మరి సెప్టెంబర్ 8న కోర్టు నుండి ఎలాంటి తీర్పు వెలువడనుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Mumbai: Being made a scapegoat in porn case, says Raj Kundra https://t.co/kYZ94TTzqn pic.twitter.com/HgeTxGi4nk
— The Times Of India (@timesofindia) August 25, 2022