తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని అఖిల్. అక్కినేని అభిమానులు అఖిల్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. నటుడిగా మంచి మార్కులు కొట్టినా.. హిట్ చిత్రాలు మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.
కథ :
హర్ష (అఖిల్) అనే ఎన్నారై ఇరవై రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. పెళ్లి చూపుల కోసం చాలా మంది అమ్మాయిలను చూసినా పెద్దగా ఇష్టపడడు. ఆ సమయంలోనే విభ (పూజా హెగ్డే) ని చూసి ఇష్టపడతాడు.. కానీ ఆమె మాత్రం హర్షను దూరంగా ఉంచుతుంది. విభ పెళ్లికి ఆసక్తి చూపించదు. విభ ఎందుకు వివాహాన్ని వ్యతిరేకిస్తోంది? సినిమా మొత్తం కథాంశం ఏమిటి.. హర్ష ఎందుకు దూరం పెడుతుంది.. ఊహించని అడ్డంకులను అధిగమించి ఆమెను వివాహం చేసుకుంటాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ :
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తీసుకొని ఓ ప్రేమ, కుటుంబ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్ ఆర్ ఐ, ఐటీ ప్రొఫెషినల్ గా అఖిల్ సింపుల్ ఉండే హర్ష(అఖిల్) పెళ్లి చేసుకోవడానికి ఇండియాకు రావడం.. చాలా మంది అమ్మాయిలను చూసినా తనకు ఇష్టమైన అమ్మాయి.. తన అభిరుచులకు తగ్గ అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇక్కడ ఫ్రెండ్స్, కుటుంబ వాతావరణం చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. పెళ్లి చూపులు సన్నివేశాలు చాలా ఫన్నీగా చూపించారు. ఈష రెబ్బా తో కొన్ని కామెడీ సీన్లు చాలా బాగున్నాయి. ఇక పూజా హెగ్డే, అఖిల్ మద్య సాగే కామెడీ సీన్లు తెరపై నవ్వులు పూయించాయి. సినిమాలో పోసాని కోర్టు సీన్లు బాగున్నాయి. పూజా హెగ్డే, అఖిల్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ కాలం అమ్మాయిలు వరుడి విషయంలో ఎలా కలలు కంటారో పూజా హెగ్డే పాత్రలో చాలా చక్కగా చూపించారు బొమ్మరిల్లు భాస్కర్. బ్యాచ్ లర్ జీవితాన్ని ఎలా గడపాలి.. కుటుంబ విలువలు ఎలా కాపాడుకోవాలి అన్న పాత్రలో అఖిల్ చక్కటి నటన కనబరిచాడు. ఫస్టాఫ్ చాలా కామెడీతో పెళ్లి చూపుల సీన్లతో సాగుతుంది. ఇక ఇంట్రవెల్ ముందు వచ్చే సీన్ సినిమాకు మంచి టర్నింగ్ పాయింట్. సెకండ్ ఆఫ్ మొత్తం సీరియస్ మోడ్ లోకి వెళ్తుంది.. పూజా హెగ్డే కోసం అఖిల్ పడే కష్టాలు.. తెరపై బాగా చూపించాడు దర్శకుడు. అక్కడక్కడ కొద్దిపాటి బోరింగ్ సీన్లు ఉన్నా చిత్రం క్లయిమాక్స్ మాత్రం అద్బుతంగా ఆవిష్కరించారు.
నటీనటుల పనితీరు :
అక్కినేని అభిమానులు అఖిల్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చేసిన ప్రతీ సినిమా బెడిసికొడుతూ వచ్చింది. ఇంతలా ప్రేమ చూపిస్తోన్న అభిమానులకు తిరిగి హిట్ ఇచ్చే వరకు నిద్రపోను అంటూ ప్రమోషన్స్‌లో చెప్పిన అఖిల్.. ఇప్పుడు తెరపై నిజంగా తన విశ్వరూపం చూపించాడు. బ్యాచ్ లర్ పాత్రలో నటిస్తూ.. ఓ ఎన్ఆర్ఐ ఎలా ఉంటాడో చూపించాడు. హర్ష పాత్రలో రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ తో ఇరగదీశాడు. ఇక గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే.. విభ పాత్రలకు జీవం పోసింది. మూవీ మొత్తానికి ఈ పాత్ర చాలా హైలెట్ గా నిలిచేలా చేసింది. ఓ వైపు గ్లామర్ షో చూపిస్తూనే స్వతంత్ర భావాలు గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. తండ్రి రొటీన్ పాత్రలో మురళీ శర్మ పెద్దగా మెప్పించలేకపోయారు. ఆయన భార్యగా ప్రగతి నటన బాగానే ఉంది. సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పోసాని కృష్ణ మురళి మరియు రాహుల్ రవీంద్రన్, చిన్మయి అతిధి పాత్రలతో చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం :
టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ కి రచన అందించారు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎన్ఆర్ ఐ గా అఖిల్ ని బాగా ఎలివేట్ చేశారు. ఫస్టాఫ్ లో కామెడీ, రొమాన్స్ తో అఖిల్ ని చక్కగా చూపించి.. సెకండాఫ్ లో మాత్రం సీరియస్, సెంటిమెంట్ తో మెప్పించేలా చేశాడు. క్లయిమాక్స్ సీన్లు బాగా పండించారు. బన్ని వాసు, వాసు వర్మ నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. ప్రదీశ్ వర్మ సీనిమాటోగ్రఫి చాలా చక్కగా అందించారు. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్ చాలా హైలెట్ గా చూపించారు. ఇక గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు హెలెట్ గా నిలిచింది. చక్కటి బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. కొన్ని చిన్నచిన్న లోపాల మినహా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’పరవాలేదు అనిపించారు.
ప్లస్ పాయింట్స్ : అఖిల్ – పూజా హెగ్డే, క్లయిమాక్స్ సీన్స్
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ కొన్ని బోర్ సీన్లు, ఊహించదగిన కథాంశం
బాటమ్ లైన్ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ నచ్చాడు
రేటింగ్ : 2.5 / 5