తెలుగు ఇండస్ట్రీలో గత రెండేళ్ల నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మృతిచెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ లోకం ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ నేతలు అశృనివాళులు అర్పిస్తున్నారు. తాజాగా సిరివెన్నల మరణంపై విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు.
‘సిరి వెన్నెల సీతారామశాస్త్రి… నాకు అత్యంత సన్నిహితుడు… సరస్వతీ పుత్రుడు… విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది… ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అంటూ మంచు మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు.
సిరి వెన్నెల సీతారామశాస్త్రి… నాకు అత్యంత సన్నిహితుడు…
సరస్వతీ పుత్రుడు…
విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది… ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.— Mohan Babu M (@themohanbabu) November 30, 2021