బాలీవుడ్ ఇండస్ట్రీలో 80, 90 దశకాల్లో తన డ్యాన్స్ తో యువతను ఉర్రూతలూగించాడు స్టార్ హీరో మిథున్ చక్రవర్తి. 1976లో మృగయ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ జుక్త నహీ, కసమ్ ఫాయిదా కర్నె వాలేకీ, కమాండో వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. ఇప్పటికీ పలు చోట్ల ‘అయాం ఏ డిస్కో డ్యాన్సర్’పాటపై డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. ఎంత సినీ నటుడు అయినా.. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయని.. మిథున్ చక్రవర్తి తాజాగా ఆసక్తికర అంశాలను మీడియాకు వెల్లడించారు.
జీవితం ఎవరికీ పూల బాటగా ఉండదు. సాధారణంగా ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాను. నా జీవితంలో మరీ అంత కష్టంగా నెట్టుకొచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. కాకపోతే నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలు.. ఇబ్బందులు చెప్తే నటుడిగా ఎదగాలనుకుంటున్న కొత్త తరాన్ని నేను నిరాశపర్చినట్లు అవుతుందని నా అభిప్రాయం. కొన్నిసార్లు నేను నా లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని భయపడ్డాను, అంతేకాదు ఆ భయంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. కానీ నా కుటుంబాన్ని చూసి విరమించుకునేవాడినని అన్నారు. కొన్ని కారణాలతో కోల్ కతాకు తిరిగిరాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.
నేను ఇప్పటి యూత్ కి ఇచ్చే సలహా ఒక్కటే.. ప్రాణం తీసుకోవాలన్న ఆలోచననే మానేయండి.. ప్రతిదానితో పోరాడండి. అలా పోరాడాను కాబట్టే నేనీ స్థాయిలో ఉన్నా. పోరాటం చేయకుండా జీవితాన్ని ముగించకూడదు అన్నారు. తాను జన్మతః పోరాటశీలినని, ఓడిపోవడం తనకు తెలియదని మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు. అందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పారు. రానురానూ మానవ విలువలు తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియాను పాజిటివ్ అంశాలకంటే కూడా నెగెటివిటీకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
100కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇటీవల వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ లోనూ నటుడిగా తన సత్తా చాటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లోనూ ప్రవేశించి రాజ్యసభకు వెళ్లారు. టీఎంసీ పార్టీకి గుడ్ బై చెప్పి గతేడాది బీజేపీలో చేరిన ఈ బెంగాలీ బాబు గతంలో రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. మిథున్ చక్రవర్తి తెలుగులో వెంకటేశ్, పవన్ కల్యాణ్ ప్రధానపాత్రల్లో వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రంలోనూ నటించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Surya: ఓ సినిమా కోసం సూర్య ఇంత కష్టపడతాడా? హేట్సాఫ్ సూర్య!