ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కు తెలుగులోనూ మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆహా ఓటీటీ వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రారంభించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపీటషన్ కి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రస్తుతం టాప్ 12 సింగర్స్ సెలక్షన్ జరుగుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తిక్ జడ్జెస్ గా ఉన్న విషయం తెలిసిందే. టాప్ 12 సింగర్స్ సెలక్షన్ సమయంలో వారి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి.
ఇదీ చదవండి: షోలో నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన జబర్దస్త్ వర్ష!
సింగర్స్ అందరూ పాటలు పాడినప్పుడు ఇద్దరికి ఆ సాంగ్ నచ్చితే ఆ తర్వాత మరొకరు అందులో ఏదో లోపం ఎత్తిచూపించారు. అలా దాదాపు ముగ్గురు సింగర్స్ విషయంలో జరిగింది. కొంగు కొంచెం భద్రం పిల్లా కొంప ముచ్చేటట్టుంది సాంగ్ పాడిన సింగర్ ను జడ్జ్ గా ఉన్న తమన్.. సాంగ్ కాంప్లికేట్ చేశారు అని కామెంట్ చేస్తాడు. కానీ, ఆ విషయంలో నిత్యామీనన్ ఏకీభవించదు. ఆ విషయం అనే కాదు మిగిలిన సింగర్స్ విషయంలోనూ వారు భిన్నాభిప్రాయాలను వ్యక్త పరిచారు. అదంతా ప్రోమోగా కట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రోమోపై నెట్టింట కామెంట్స్ బాగా వస్తున్నాయి. చాలా మంది ఇది టీఆర్పీ స్టంట్ అంటూ చెబుతున్నారు.
ఇలాంటివి డాన్సింగ్ షోల నుంచి సింగింగ్ షోలకు తీసుకొచ్చారా? మీ టీఆర్పీ సంస్టలు మాకు తెలుసులే అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆ విషయంలో నిత్యా మీనన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె వాయిస్ చాలా బాగుందని నిత్యా చెప్పిందే కరెక్ట్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.