‘మీర్జాపూర్’.. ఈ వెబ్ సిరీస్ పేరు చెప్పగానే రెండే పాత్రలు గుర్తొస్తాయి. ఒకటి మున్నాభయ్యా, మరొకటి గుడ్డూ భయ్యా. వీళ్ల పాత్రలు, చెప్పే మాస్ డైలాగ్స్.. నెటిజన్స్ తో విజిల్స్ వేసేలా చేశాయి. ఈ సిరీస్ లోని గుడ్డూ, మున్నా పలికిన డైలాగ్స్ ని మీమ్స్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇక రెండు సీజన్లతో ఎంతో ఎంటర్ టైన్ చేసిన దీని మూడో సీజన్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగానే గుడ్డూ భయ్యా.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ అంటే గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘మీర్జాపూర్’ గుడ్డూ భయ్యా అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. హీరోయిన్ పాత్ర స్వీటీ పండిట్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. కానీ తొలి సీజన్ చివర్లో స్వీటీని గన్ తో షూట్ చేసిన మున్నాభయ్యా.. గుడ్డూ-స్వీటీని విడగొడతాడు. ఇక దీనిపై రెండో సీజన్ లో మున్నాపై గుడ్డూ ప్రతీకారం తీర్చుకుంటాడు. మరి మూడో సీజన్ ఎలా ఉండబోతుందనేది త్వరలో తెలిసిపోతుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ కంటే హిందీలో చాలా చిత్రాలు చేసిన అలీ ఫజల్.. ‘ఫక్రే’ సినిమా చేస్తున్న సమయంలోనే హీరోయిన్ రిచా చద్దాతో ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి అంటే దాదాపు 13 ఏళ్ల నుంచి వీళ్లు రిలేషన్ లో ఉన్నారు. ఇక వీళ్ల పెళ్లి అప్పుడూ ఇప్పుడూ అని వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు అది ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబరు 4న తమ వివాహం జరగనుందన అధికారికంగా ప్రకటించారు. దీంతో వీళ్ల ఫ్యాన్స్.. హమ్మయ్యా ఇప్పటికైనా సరే పెళ్లి చేసుకుంటున్నారని రిలాక్స్ అవుతున్నారు.
2020 నుంచి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. కానీ కుదరడం లేదని రిచా చెప్పింది. ఒకసారి కరోనా వల్ల, మరోసారి వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి మిస్ అయిందని పేర్కొంది. ఈ అడ్డంకులు లేకపోయింటే, ఈపాటికే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేవాళ్లమని రిచా తెలిపింది. ఇప్పుడు పెళ్లి తేదీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఫెమీనా మ్యాగజైన్ కోసం ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ నిర్వహించారు. వీళ్ల వివాహ వేడుకకు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 3 రిలీజ్ ఎప్పుడంటే!