ఈ మధ్యకాలంలో హోమ్లీ బ్యూటీలుగా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా గ్లామర్ డోస్ పెంచేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అలా తెలుగులో పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన హీరోయిన్.. చాలా గ్యాప్ తర్వాత కనిపించి సర్ప్రైజ్ చేసింది. కేరళకు చెందిన ఆ మలయాళీ బుట్టబొమ్మను ఇప్పుడు చూసినా తెలుగువారికి హోమ్లీ బ్యూటీగానే కనిపిస్తుంది. ఎందుకంటే.. తెలుగులో స్టార్ హీరోల సరసన కూడా డీగ్లామర్ రోల్స్ చేసి మెప్పించింది. అదీగాక 8 ఏళ్ళ క్రితమే పెళ్లి కూడా చేసుకుంది. తర్వాత ఏమైందోగానీ.. భర్తకు దూరంగా ఉంటూ గ్లామర్ షోతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇంతలా చెబుతున్నారు.. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? ఆమె మీరా జాస్మిన్.
మీరా జాస్మిన్ పేరు వినగానే అందరికీ అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. హోమ్లీ రోల్స్ తో అంతలా ప్రేక్షకులకు దగ్గరైన మీరా.. ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయం పక్కన పెడితే.. గ్లామర్ షో పరంగా మాత్రం కుర్రకారు మతులు పోగొడుతుందని చెప్పుకోవచ్చు. ఈ షో అంతా మీదేనా అనే ఫ్యాన్స్ షాకయ్యే రేంజిలో అమ్మడి అందాలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇటీవల తెలుగు సినిమాలలో అయితే కనిపించలేదు.. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే ఇలా మేని ఒంపులను ఎరగా వేస్తోంది నలభైయేళ్ళ హోమ్లీ భామ.
ఇప్పుడున్న కుర్ర హీరోయిన్ల గ్లామర్ చూసే షాక్ అవుతున్న సందర్భంలో మీరా జాస్మిన్ వచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ తో అల్లాడించేస్తోంది. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా టాప్ టు బాటమ్ కెమెరా ముందు పరిచేస్తోంది మీరా. సోషల్ మీడియాలో మీరా పెడుతున్న ఫోటోలు చూస్తే.. ఎవరైనా మీరా? అని ముక్కున వేలేసుకోవాల్సిందే. అలా ఉంటున్నాయి ఫోటోలలో మీరా పరువాల పరవళ్లు. తాజాగా మీరా పోస్ట్ చేసిన పిక్.. నెట్టింట హాట్ నెస్ పెంచుతోంది. ట్రాన్స్ పేరెంట్ బ్లాక్ డ్రెస్ లో అమ్మడు సైడ్ లుక్కులో దాచాల్సినవన్నీ బహిర్గతం చేసేసింది. దీంతో పిక్ లో మీరాను చూస్తున్న నెటిజన్స్, ఫ్యాన్స్ అంతా వయసు పెరుగుతున్నా వన్నె తరగలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.