తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. స్టార్ హీరోలతో పోటీ ఇస్తూ యంగ్ హీరోలు ఎలా సినిమాలు తీస్తుంటారో.. ఆ హీరోలందరితోనూ నటించే హీరోయిన్లు ఏ ఏడాదికి ఆ ఏడాది, టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే ఉంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందులో కొందరు సినిమాల పరంగా ఫెయిల్ కావొచ్చేమో కానీ గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా తెలుగులో సినిమాలు చేసిన హీరోయినే. మీకు టాలెంట్ ఉంటే ఎవరో గుర్తుపట్టండి చూద్దాం?
ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్నచిన్నారి.. ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్న మీనాక్షి చౌదరి. 2018లో ఫెమినా మిస్ ఇండియా విన్నర్ గా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్ గా నిలిచింది. అలా అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. సినిమా మిక్స్ డ్ రివ్యూలు తెచ్చుకుంది. గానీ ఈమె అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే ఇందులో ఈమె ఫేస్, స్మైల్ చూసి వరస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కొన్ని ఛాన్సులు మాత్రమే ఈమెని వరించాయి.
ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో మీనాక్షి కూడా ఓ హీరోయిన్ గా చేసింది. మాస్ పాటకు స్టెప్పులేసింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా చేసిన హిట్-2 విడుదల కావాల్సి ఉంది. అడివి శేష్ హీరోగా చేసిన ఈ థ్రిల్లర్ చిత్రం.. డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. తమిళంలోనూ ‘కొలై’ సినిమా చేసింది. మరో చిత్రానికి రెడీ అయింది. మరి మీనాక్షి చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: తొలిసారి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన భాను