కన్నడ సినిమా అనగానే మనలో చాలామందికి 'కేజీఎఫ్' గుర్తొస్తుంది. ఇప్పుడు దాన్నే మించిపోయేలా మరో సినిమా తీసినట్లున్నారు. ఇప్పుడు ఆ చిత్రం టీజర్ వైరల్ గా మారింది.
ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమా ట్రెండ్. దాదాపు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ అలాంటి సినిమాలే తీస్తున్నారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోగా.. ‘కేజీఎఫ్’తో కన్నడ ఇండస్ట్రీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు కర్ణాటక వరకు మాత్రమే పరిమితమైన కన్నడ సినిమాలకు ‘కేజీఎఫ్’ సరికొత్త రూట్ చూపించింది. సినిమాని గ్రాండియర్ గా తీయాలే గానీ వేల కోట్ల కలెక్షన్స్ సాధించొచ్చని ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఆ సినిమానే మించిపోయేలా మరో సినిమా పాన్ ఇండియా విడుదలకు సిద్ధమైపోయింది. టీజర్ చూస్తే అదే అనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పేరు మార్మోగిపోయేలా చేసిన సినిమా ‘కాంతార’. ఈ రెండు సినిమాల పరంగా చాలా డిఫరెంట్. ఒకటేమో ఫుల్ యాక్షన్ జానర్.. మరొకటి చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన డ్రామా. ఇప్పుడు కన్నడ నుంచి ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయిపోయిన సినిమా ‘మార్టిన్’. వీళ్లు ‘కేజీఎఫ్’ చూపిన రూట్ ని ఎంచుకున్నారు. దాదాపు అదే స్టైల్ లో సినిమా తీసినట్లు కనిపిస్తుంది. తాజాగా రిలీజైన టీజర్ లో షాట్స్, ఎడిటింగ్ కట్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అయితే ‘కేజీఎఫ్’ కంటే ఇందులో యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగానే పెట్టినట్లు కనిపిస్తుంది.
తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరో అర్జున్ మేనల్లుడు ధృవసర్జా.. ‘మార్టిన్’లో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ ఈ సినిమాకు స్టోరీ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. ఇక ఈ టీజర్ ని స్పోర్ట్స్ కార్స్, బైక్ ఛేజింగులు, కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ తో నింపేశారు. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. టీజర్ చూస్తే హీరో విలన్ ఒక్కడే అని తెలిసిపోతుంది. టీజర్ వరకు బాగానే ఉంది కానీ సినిమాలో సరైన స్టోరీ ఉంటే ప్రేక్షకులు హీరో ఎవరనేది చూడకుండా హిట్ చేసేస్తారు. మరి ‘మార్టిన్’ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదే థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు కానీ డేట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ టీజర్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.