బుల్లితెర పాపులర్ షో ‘బిగ్ బాస్’ దేశవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని భాషల్లో కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అలాగే తెలుగులో సైతం ఎంతో క్రేజ్ ను తెచ్చుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి త్వరలోనే అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్ ఎవరు అన్న ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, నాగార్జునలు ఈ షోకు హోస్ట్ లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరి సీజన్ 7 కు హోస్ట్ లుగా వ్యవహరిస్తారు అంటూ పలువురి పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
‘బిగ్ బాస్’.. బుల్లితెర షోలల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను కలిగి ఉన్న టీవీ షో. గత 6 సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్ బాస్ త్వరలోనే 7వ సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. అయితే బిగ్ బాస్ 6వ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, తదుపరి సీజన్ కు ఉండటం లేదని తెలుస్తోంది. దాంతో సీజన్ 7కు హోస్ట్ ఎవరిని తీసుకోవాలా? అని బిగ్ బాస్ టీమ్ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఈ షోకు హోస్ట్ గా బాలకృష్ణ, రానా పేర్లు వినిపించినప్పటికీ ఆ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్ గా ‘మా’ అధ్యక్షులు, హీరో మంచు విష్ణు వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ విష్ణును సంప్రదించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి అన్నీ కుదిరితే విష్ణుని బిగ్ బాస్ షోలో చూడొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సినిమా వేడుకల్లో చలాకీగా మాట్లాడే విష్ణు.. బిగ్ బాస్ షోకి ఒక వేళ హోస్ట్ గా వ్యవహరిస్తే ఏ విధంగా మెప్పిస్తాడో వేచి చూడాలి.
As Per latest News Manchu Vishnu demanded 15 Cr Huge Remuneration #ManchuVishnu #BiggBossTelugu6 #BiggbossTelugu7 #MAAPresident #FilmyLooks @FilmyLooks pic.twitter.com/DwABaeXKWG
— Filmylooks (@filmylooks) December 23, 2022