ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే సెలబ్రిటీలలో మంచు లక్ష్మి ఒకరు. తమపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. లైట్ తీసుకొని, అవే ట్రోల్స్ ని ఎంజాయ్ చేసేంత మంచి మనసు కూడా లక్ష్మికి ఉందని చెప్పాలి. ఈసారి మహాశివరాత్రిని మంచు లక్ష్మి కూడా దాదాపు శివారాధనలో.. శివనామ స్మరణలో గడిపింది.
ఇండస్ట్రీకి సంబంధించి ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే సెలబ్రిటీలలో మంచు లక్ష్మి ఒకరు. ఎప్పుడూ ఏదొక అప్ డేట్ తోనో లేక ఏదైనా వార్తతోనో సోషల్ మీడియాలో ఆమె పేరు వినిపిస్తూ ఉంటుంది. అదీగాక ఎక్కువగా ట్రోల్స్ ఫేస్ చేసేది కూడా మంచు ఫ్యామిలీనే కాబట్టి.. లక్ష్మి పేరు ట్రోల్స్ లో కూడా యాక్టీవ్ గానే ఉంటుందనుకోండి. అయితే.. తమపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. లైట్ తీసుకొని, అవే ట్రోల్స్ ని ఎంజాయ్ చేసేంత మంచి మనసు కూడా లక్ష్మికి ఉందని చెప్పాలి. ఎన్నోసార్లు ట్రోల్స్ రూపంలో అయినా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాం అని పాజిటివ్ గా మాట్లాడి.. ట్రోలర్స్ మనసులు కూడా గెలుచుకుంది మంచు లక్ష్మి.
ఈ క్రమంలో మంచు లక్ష్మి సినిమాలు, సోషల్ మీడియా పోస్టులు, ట్రోల్స్ మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు వినూత్నమైన ప్రయోగాలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా అలాంటి ప్రయోగమే చేసింది. శివరాత్రి అంటే.. లోకమంతా శివారాధనతో.. శివ నామ స్మరణతో నిండిపోతుంది. ఎంతోమంది భక్తులు నిష్ఠతో శివుడిని పూజించడం.. ఆరాధించడం చేస్తుంటారు. కాగా.. ఈసారి మహాశివరాత్రిని మంచు లక్ష్మి కూడా దాదాపు శివారాధనలో.. శివనామ స్మరణలో గడిపింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ.. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడి.. వీడియో రిలీజ్ చేసింది.
ఈ స్పెషల్ సాంగ్ ని మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం విశేషం. ఈ సాంగ్ వీడియోని తన సొంత యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. పైగా సాంగ్ మధ్యలో శంకరాచార్యుల శ్లోకాలకు అర్థాన్ని చెబుతూ.. ఇంగ్లీష్ ర్యాప్ క్రియేట్ చేసింది లక్ష్మి. ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన ఈ సాంగ్ ఇప్పుడు శ్రోతలందరికి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మంచు లక్ష్మి వాయిస్ లో సాంగ్ విన్న నెటిజన్స్ కూడా సాంగ్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పాటను కన్ను సమీర్ కంపోజ్ చేశారు. కాగా.. సాంగ్ ని కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మరి మంచు లక్ష్మి.. స్పెషల్ సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.