మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయంలో మోహన్‌బాబు కీలకపాత్ర పోషించారు. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన మోహన్‌బాబుకు తెలుగుపై మంచి పట్టు ఉంది. సినిమాల్లో భారీ భారీ డైలాగులను అనర్గళంగా చెప్పి థియేటర్లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించారు. ఇప్పుడు ఆయన ఒక పద్యం చదివి, దానికి అర్థం చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్‌బాబు పద్యం చదువుతుండగా ఆయన కుమార్తె మంచు లక్ష్మి వీడియో తీసి, ఫేస్బుక్లో పోస్టు చేశారు. మా నాన్న డిక్షన్ చూడండి. ఇలా మీలో ఎవరైనా రిపీట్ చేయగలరా? అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరారు. డైలాగ్ కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించారు.
