సాధారణంగా ఎవరైనా హీరోయిన్స్ మొదటి సినిమాకే గ్లామర్ షో చేస్తే.. వారిని చాలా బోల్డ్ అని డిసైడ్ చేస్తుంటాం. కానీ.. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఎలాంటి గ్లామర్ షోకి అవకాశం ఇవ్వరు. ఉదాహరణకు సాయి పల్లవి, నిత్య మీనన్, ప్రియాంక మోహన్ ఈ వరుసలో ఉంటారు. అయితే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్నాళ్ల వరకు గ్లామర్ షో చేయకుండా.. సడన్ గా ముద్దు సీన్స్, బోల్డ్ సీన్స్ లో నటించి అందరిని షాక్ కి గురి చేస్తారు.
సాధారణంగా ఎవరైనా హీరోయిన్స్ మొదటి సినిమాకే గ్లామర్ షో చేస్తే.. వారిని చాలా బోల్డ్ అని డిసైడ్ చేస్తుంటాం. కానీ.. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఎలాంటి గ్లామర్ షోకి అవకాశం ఇవ్వరు. చాలా సంప్రదాయ పాత్రల్లో కనిపిస్తూ.. ప్రేక్షకుల మనస్సులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. ఉదాహరణకు సాయి పల్లవి, నిత్య మీనన్, ప్రియాంక మోహన్ ఈ వరుసలో ఉంటారు. అయితే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్నాళ్ల వరకు గ్లామర్ షో చేయకుండా.. సడన్ గా ముద్దు సీన్స్, బోల్డ్ సీన్స్ లో నటించి అందరిని షాక్ కి గురి చేస్తారు. తాజాగా హీరోయిన్ మాళవిక నాయర్.. తన కొత్త సినిమా ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’లో ముద్దు సీన్స్ చేసి ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.
మాళవిక నాయర్ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే.. అయినప్పటికీ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మంచి పేరుని సంపాదించుకుంది. దీనికి కారణం ఆమె తన ప్రతి సినిమాల్లో ఎంచుకున్న పాత్రలే. ఆహా కళ్యాణం, కల్యాణ వైభోగమే, ఒరేయ్ బుజ్జిగా, థాంక్యూ లాంటి సినిమాల్లో ఎలాంటి ఎక్స్ పోజింగ్ కి వెళ్లకుండా డీసెంట్ రోల్స్ చేస్తూ తన కెరీర్ ని నెట్టుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే.. ఇప్పుడు ఆ రూల్ బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. నాగశౌర్యకు జంటగా నటించిన ఫలానా అమ్మాయి- ఫలానా అబ్బాయి మూవీ.. ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తొలిసారి మాళవిక ముద్దు సీన్లలో నటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ముద్దు సీన్ విషయమై ప్రస్తావిస్తూ.. ఆ సీన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో మీడియాతో చెప్పుకొచ్చింది మాళవిక. “ఈ సినిమాలో ముద్దు సీన్లో నటించినందుకు నేను ఇబ్బందిగా భావించడం లేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సన్నివేశం కాదు. కథలో భాగంగా, కథకు అవసరమైన సన్నివేశం. అందుకే ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది” అని వివరణ ఇచ్చింది. ఇటీవల ‘సీతారామం’ సినిమాతో అభిమానులని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్.. తన కొత్త సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసి ఆడియన్స్ కి పెద్ద ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్ మాళవిక నాయర్ కూడా ముద్దు సీన్లలో నటించి వార్తల్లో నిలిచింది. మరి హీరోయిన్స్ బోల్డ్ సీన్స్, ముద్దు సీన్స్ లో నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.