ఈమె నటిగా కంటే ఐటమ్ డ్యాన్సర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తనకంటే చాలా చిన్నోడైన హీరోతో రిలేషన్ లో ఉంది. ఎప్పటికప్పుడు హాట్ పోజులతో రెచ్చగొట్టే ఈ భామ ఎవరో కనిపెట్టారా?
ఈమె ప్రముఖ నటి. ఐటమ్ సాంగ్స్ పేరు చెప్పగానే ఆలోవర్ ఇండియన్ ప్రేక్షకులకు ఈమెనే గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన మూవీలో చేసింది. రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ లోనూ స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆమె వయసు దాదాపు 50 ఏళ్లు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే మాత్రం అలా అస్సలు అనిపించదు. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా మంచి ఊపు మీద ఉంటుంది. ఇదంతా పక్కనబెడితే ఓ యంగ్ హీరోతో ఆమె రిలేషన్ షిప్ లో ఉంది. సోషల్ మీడియాలో వీళ్ల హడావుడి మాములుగా ఉండదు. తాజాగా ఓ విచిత్రమైన పనిచేసి హాట్ టాపిక్ అయ్యాయ. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ చదువు పూర్తయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వీడియో జాకీ(VJ)గా అవకాశం దక్కించుకుంది. పలు ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మోడలింగ్ లోకి ఎంటరైంది. 1997లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ‘చల్ చయ్యా చయ్యా’ సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. యస్ మీరు గెస్ చేసింది కరెక్ట్. పైన ఫొటోలో ఉన్న పాప మలైకా అరోరా. బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కి ఈమె పెట్టింది పేరు. నటి, డ్యాన్సర్, మోడల్, వీజే, ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో చాలా విభాగాల్లో తన టాలెంట్ చూపించింది. చెప్పాలంటే అందం దగ్గర నుంచి చాలా విషయాల్లో ఈమె తోపు అని చెప్పొచ్చు.
చెప్పాలంటే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని 1997లోనే పెళ్లి చేసుకుంది. వీళ్ల బంధానికి గుర్తుగా ఓ కొడుకు కూడా పుట్టాడు. దాదాపు 20 ఏళ్ల పాటు కలిసే ఉన్న ఈ జంట.. 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరగడానికి ఓ ఏడాది ముందు నుంచే అంటే 2016 నుంచే హీరో అర్జున్ కపూర్ తో ఈమె రిలేషన్ లో ఉంది. తాజాగా అర్జున్ బెడ్ రూమ్ లో న్యూడ్ గా ఉన్న పిక్ పోస్ట్ చేయడంతో ప్రతిఒక్కరూ మలైకాని ట్రోల్ చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ‘దబంగ్’లో మున్నీ బద్నామ్, ‘గబ్బర్ సింగ్’లో కెవ్వు కేక సాంగ్స్ కి డ్యాన్స్ తో చితక్కొట్టేసింది ఈ బ్యూటీనే. సో అదనమాట విషయం. మరి ఈమె చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.