Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు, షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి భార్యా, పిల్లలతో ఇటలీ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో మునిగిపోయారు. ఆ సమయాన్ని ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. వెకేషన్‌కు సంబంధించిన అప్‌డేట్లను భార్య నమ్రతా శిరోధ్కర్, కూతురు సితారా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉన్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతూ ఉన్నాయి. తాజాగా, మహేష్ బాబు ఇటలీ వీధుల్లో కూతురితో తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను స్వయంగా సితారే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
‘‘ సమ్మర్‌లో ఇలా నాన్నతో నడవటం.. ఎప్పటికీ నా ఫేవరేట్’’ అని రాసుకొచ్చారు. కాగా, మహేష్ భరత్ అనే నేను సినిమానుంచి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా, విడుదలైన సర్కారు వారి పాట సైతం మంచి విజయాన్ని దక్కించుకోవటంతో పాటు, కలెక్షన్ల పరంగా కూడా సూపర్ అనిపించుకుంది. మహేష్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. మహేష్- రాజమౌళిల సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.
అది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ సినిమాగా ఉండనుందని సమాచారం. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ప్రీ పొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక, మహేష్ బాబు ఇటలీ వెకేషన్‌నుంచి తిరిగొచ్చిన కొద్దిరోజులకు త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. వచ్చే నెలనుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. మరి, మహేష్ బాబు ఇటలీ వీధుల్లో కూతురితో తిరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పెళ్లికి రాని నయనతార తల్లి! పెళ్ళైన 5 రోజులకే పుట్టింటికి..