సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కటంటే ఒక్కటే ఫొటో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోయాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మహేష్ ఫొటోలే దర్శనిమిచ్చాయి. మరీ దానికి రీజన్ ఏంటి?
సెలబ్రిటీలు ఏం చేసినా సరే అది వైరల్ అవుతూనే ఉంటుంది. అలా తాజాగా చాలా వైరల్ అయిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతడి గత సినిమా వచ్చి దాదాపు ఏడాది కావొస్తుంది. కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది కానీ దాని గురించి పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు. మరోవైపు రాజమౌళితో తర్వాత చేయబోయే చిత్రం కోసం బాగానే కష్టపడుతున్నాడు. రీసెంట్ గా అందుకు సంబంధించిన జిమ్ ఫొటోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఇప్పుడు క్లాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు, అతడి భార్య నమ్రత.. తెలుగు నటీనటులతో మాత్రమే కాదు దాదాపు సెలబ్రిటీలందరితోనూ మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా సానియా మీర్జా ఫేర్ వెల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మహేష్-నమ్రత ఇద్దరూ కూడా బ్లాక్ ఔట్ ఫిట్స్ తో కనిపించారు. మొత్తం వేడుకకే వేడుక తీసుకొచ్చారా అనేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు చాలావరకు ట్విట్టర్, ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో మహేష్ దంపతులతో పాటు ఏఆర్ రెహమాన్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా తెగ సందడి చేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్.. హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు. గతంలో వీళ్లిద్దరూ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’.. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేదు గానీ ఆ తర్వాత టీవీ, సోషల్ మీడియాలో మాత్రం యమ క్రేజ్ సంపాదించాయి. దీంతో తాజా ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్నారు. వీళ్ల కాంబోలో రాబోయే మూవీ ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీయనున్నట్లు తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే మహేష్ తాజాగా ట్రెండింగ్ లో నిలవడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
What a journey!! So so proud of you! 🤗 @MirzaSania pic.twitter.com/qyWAIUs0XB
— Mahesh Babu (@urstrulyMahesh) March 5, 2023