Mahesh Babu: సాధారణంగా అభిమాన సినీతారలకు సంబంధించి కొత్తగా ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులలో కనిపించే సందడి వేరు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా అబ్బాయిలతో పాటు కోట్లాది లేడీ ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతుంటారు. సర్కారు వారి పాట విజయం తర్వాత ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్న మహేష్ బాబు.. తాజాగా ఓ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు.
అందులో మహేష్ ఫ్యామిలీతో పాటు మహేష్ సోదరి మంజూల ఫ్యామిలీ, బావ సుధీర్ ఫ్యామిలీ, పొలిటిషన్ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ కూడా కనిపించడం విశేషం. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసిన మహేష్ బాబు.. అందరితో కలిసి ఓ సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ‘ఫ్యామిలీతో ఓ పిక్’ అంటూ క్యాప్షన్ జోడించి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం హైలైట్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. త్వరలోనే మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా పట్టాలెక్కబోతుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు ‘SSMB28’ అని వర్కింగ్ టైటిల్ ప్రకటించారు మేకర్స్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక మహేష్ సరసన పూజా హెగ్డే మరోసారి జతకట్టనుంది. ఈ సినిమా తర్వాత మహేష్ – రాజమౌళిల పాన్ ఇండియా మూవీ మొదలు కానుంది. మరి మహేష్ బాబు లేటెస్ట్ ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
‘One with the fam’
– SuperStar @urstrulyMahesh ‘s Insta Story ❤️ #SSMB #SSMB28pic.twitter.com/tAkpkZpvsq— #BlockBusterSVP🔔🌟💥 (@UrstrulyVarmaa) July 19, 2022
#NamrataShirodkar Via Instagram Post 📯#SSMB28 @urstrulyMahesh pic.twitter.com/7C4dA2bArt
— Chivaluru Mahesh FC 🔔 (@ChivaluruMbFC) July 19, 2022