తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటుడు మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. టాలీవుడ్ లో వివాద రహితుడిగా, సౌమ్యుడిగా ఉంటూ అభిమానుల మదిలో సుస్థిర స్థానం సంపాధించుకున్నారు. సందేశాత్మక సినిమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజ జీవిత హీరోగా నిలుస్తున్నారు.
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటుడు మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. టాలీవుడ్ లో వివాద రహితుడిగా, సౌమ్యుడిగా ఉంటూ అభిమానుల మదిలో సుస్థిర స్థానం సంపాధించుకున్నారు. సందేశాత్మక సినిమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజ జీవిత హీరోగా నిలుస్తున్నారు.
ఓ వైపు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరో వైపు పేదవారిని ఆదుకుంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆ మధ్య వచ్చిన శ్రీమంతుడు సినిమాలో లాగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే నటుడు మహేష్ గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించి తల్లిదండ్రుల జీవితాల్లో సంతోషం వెల్లువిరిసేలా చేస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది పసి హృదయాలను బ్రతికిస్తున్నారు. తాజాగా మరో రెండేళ్ల బాలుడికి ఉచితంగా గుండె సర్జరీ చేయించి మంచి మనసు చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన రెండేళ్ల కార్తికేయ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు చికిత్స కోసం ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడికి హార్ట్ లో రంద్రం ఉన్నట్లు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యరు. పేదరికంతో బాధపడుతున్న వారికి ఈ ఆపద నుంచి ఎలా బయట పడాలో అర్థం కాలేదు. ఇదే సమయంలో ఇరుగు పొరుగు వారి ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ గురించి తెలుసుకున్నారు.
వెంటనే బాలుడిని తీసుకుని వెళ్లి ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో బాలుడికి హార్ట్ ఆపరేషన్ చేసి ప్రాణాలను నిలబెట్టారు. వైద్యుల పర్యవేక్షణ అనంతరం బాలుడిని డిశ్చార్జ్ చేసినట్లు తల్లిదండ్రలు వెల్లడించారు. పూర్తి ఉచితంగా గుండె ఆపరేషన్ చేసి తమ కొడుకు ప్రాణాలను నిలిపినందుకు ఆ తల్లిదండ్రులు మహేష్ బాబు ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇది చూసిన అభిమానులు మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పేదవారికి అండగా ఉంటూ, పసి హృదయాలను రక్షిస్తూ మహేష్ బాబు మానవత్వాన్ని చాటుకుంటున్నారని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.
Karthikeya aged 2yr old was diagnosed by Moderate size PDA, Underwent cardiac intervention for congenital heart disease..Child has been treated and discharged from the hospital in good health. 🙏
Grateful to the team at #AndhraHospitals for their support 🙏❤️#MbforSavingHearts pic.twitter.com/68mW6XLarD— Mahesh Babu Foundation (@MBfoundationorg) May 29, 2023