ఈ నెల నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ కాలం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీలోకం శోక సంద్రంలో మునిగితేలింది. ఇక మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పని లేదు. తన వెన్నంటే ఉంది.. ధైర్య, సాహసాలను నూరి పోసిన తండ్రి లేరన్న బాధని తలచుకుని.. చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. తండ్రి మీద ప్రేమతో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. “మీ జీవితం గొప్పగా సాగింది. మీరు స్వర్గస్తులవ్వడాన్ని ఇంకా ఘనంగా జరుపుకుంటున్నారు. అది మీ గొప్పతనం. మీరు మీ జీవితంలో భయం లేకుండా జీవించారు. డేరింగ్ అండ్ డేషింగ్ మీ వ్యక్తిత్వం. నా ఆదర్శం, నా ధైర్యం.. మీలో నేను చూసుకున్నవన్నీ నిజంగా ముఖ్యమైనవి.. అవన్నీ మీతో పాటే అలా వెళ్లిపోయాయి.
కానీ విచిత్రంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నాలో శక్తిని అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను. మీరు వెలిగించిన ఆత్మవిశ్వాస జ్యోతి నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని, మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న. నా సూపర్ స్టార్ మీరు’ అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా వాళ్లకు చావు లేదు. చూసే లోకం, చూపించే సాధనం ఉన్నంతవరకూ కళాకారులకు చావు లేదు. వాళ్ళు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. చిరంజీవులుగా చిరకాలం జీవించే ఉంటారు.
Love you Nanna.. My Superstar!
“Now I am Fearless”
“I will carry your legacy forward”
“I will make you even more Proud”Superstar @UrstrulyMahesh pens a heartfelt note about #SuperStarKrishna garu ❤️🙏 pic.twitter.com/P4yhsZgV0k
— SumanTV (@SumanTvOfficial) November 24, 2022
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022