టాలీవుడ్ టార్చ్ బేరర్ గా, తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా పేరుగాంచిన వ్యక్తి కృష్ణ. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. నష్టం వస్తుందేమో.. ప్రేక్షకులు ఆదరించరేమో అనే భయం లేకుండా అనుకున్నదే తడవుగా ఎన్నో వినూత్న చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకాదరణ పొందారు. తొలి కౌబాయ్, తొలి ఈస్ట్ మన్, తొలి 70ఎంఎం, తొలి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ సొంతం. ఈ మే 31న సూపర్ స్టార్ కృష్ణ 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మహేశ్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే నాన్న.. నిజంగా నీలాంటి వ్యక్తి మరొకరు లేరు. ఇంకా మరెన్నో వసంతాలు నువ్వు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ..’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మహేశ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022
కోడలు నమ్రతా కూడా సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కొన్నేళ్లుగా నాకున్న ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాల్లో మీరూ భాగంగా ఉన్నారు. మీరు నాకు అందించిన ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు రుణపడి ఉంటాను. నా భర్త, నాకు, మా అందరికీ తండ్రిగా, పెద్దగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్ డే మామయ్య.. వీ ఆల్ లవ్ యూ’ అంటూ నమ్రత శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలు తెలియజేయండి.
Wishing Ever Green Superstar The Legendary #Krishna garu A Very Happy Birthday !!#HBDLegendarySSK pic.twitter.com/krVS2fXnHw
— Gopichandh Malineni (@megopichand) May 31, 2022
Wishing A very Happy Birthday to the Evergreen Superstar ⭐ #Krishna garu. May you have many more beautiful years ahead!#HBDSuperstarKRISHNA#HBDLegendarySSK pic.twitter.com/vnwR1dotau
— SVCC (@SVCCofficial) May 31, 2022
Here’s wishing the Legendary Actor, Evergreen Superstar #Krishna garu a very happy birthday! May this year be filled with great health & happiness.✨🌟#HBDLegendarySSKgaru pic.twitter.com/0hBV82LN4p
— Geetha Arts (@GeethaArts) May 31, 2022
Happy birthday to evergreen legendary actor superstar krishna Garu, Wishing You A Good Health And Happiness.@UrstrulyMahesh #HBDSuperstarKrishnaGaru#SarkaruVaariPaata #HBDKrishnaGaru#SuperStarKrishna #YSR pic.twitter.com/PaFFqv0QeL
— Rajini Vidadala (@VidadalaRajini) May 31, 2020