హీరో క్యారక్టరైజేషన్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమా తీయగల దర్శకుడు పూరీ జగన్నాథ్. క్యారెక్టరైజేషన్ లో దమ్ము ఉంటే ఇండస్ట్రీని షేక్ చేసే పెర్ఫరామెన్స్ ఇవ్వగల నటుడు విజయ్ దేవరకొండ. ఇలాంటి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణా్ జోహార్, పూరి జగన్నాథ్ , ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ తో పూరీ తన మార్క్ అందుకోవడం, విజయ్ దేవరకొండకి ఆల్ ఓవర్ ఇండియాలో ఫాలోయింగ్ ఉండటం. పైగా.., పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ కావడంతో లైగర్ ఓటీటీ రైట్స్ కోసం కొన్ని ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే.. తాజాగా లైగర్ టీమ్ కి భారీ ఆఫర్ అందినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కుల కోసం ఏకంగా రూ.200 కోట్లు ఆఫర్ చేసిందట. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో పాటు .., ఆల్ ఓవర్ సౌత్ తో పాటు, బాలీవుడ్ శాటిలైట్ రైట్స్ కి కలిపి ఇంత పెద్ద అమౌంట్ కోట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సినిమాలకు ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. పూరీ ఖాతాలో కూడా ఈ స్థాయి కలెక్షన్స్ లేవు. కానీ.., మూవీ బాగా వచ్చి.., కరోనా పరిస్థితిలు సహకరిస్తే ధియేటర్స్ రిలీజ్ తో ఈ మొత్తాన్ని ఈజీగా బీట్ చేసేయవచ్చు.
కరణా్ జోహార్ నిర్మాత కాబట్టి బాలీవుడ్ లో లైగర్ ప్రమోషన్స్ కి, రిలీజ్ కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలుగునాట కూడా పూరీ -విజయ్ కాంబో పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ లో రిస్క్ లేకపోలేదు. ఓటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపితే రిలీజ్ కి ముందే టేబుల్ ఫ్రొఫిట్ పక్కా. దీంతో.., నిర్మాతలు ఈ విషయంలో ఆలోచనలో పడ్డారట. త్వరలోనే ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని ఆ ఓటీటీ సంస్థకి ధర్మ ప్రొడక్షన్స్ నుండి రిప్లయ్ అందినట్టు తెలుస్తోంది. మరి లైగర్ గర్జించబోయేది ధియేటర్ లోనా? ఓటీటీ లోనా ? అనేది తెలియాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.