ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు.. యాక్టింగ్ తో పాటు తమకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటారు. స్టార్ యాంకర్ సుమా కనకాల.. ‘సుమక్క’ పేరుతో తను చేసిన వీడియోస్ యూట్యూబ్ లో ఎంతలా ఆదరణ పొందాయో మనకు తెలిసిందే. అదే కోవలో మరికొందరు స్టార్స్ కూడా తమ హోమ్ టూర్ సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా మంచు లక్ష్మీ కూడా తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉంటున్న ఇంద్రభవనం లాంటి ఇంటిని వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో చూస్తే ఆ ఇంద్రభవనం లాంటి ఇల్లు పచ్చని కొండల మధ్య ఉంది. మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణతో కలసి ఇల్లంతా తిరుగుతూ సందడి చేసింది. ఇంటిలోని గార్డెన్ ఏరియా, చిన్నారుల కోసం ప్రత్యేక గది, జిమ్, స్టీమ్ రూమ్, మినీ థియేటర్.. ఇలా ఇంటిలోని గదులన్నింటిని కలియ తిరుగుతూ చూపించింది. మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు జీవిత ప్రస్థానంకి సంబంధించిన ఫోటోస్ ను చూపించింది.
మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్‌బాబు విజయప్రస్థానం గురించి వీడియోలో చెప్పారు . “ఎక్కడో మొదుగులపాలెం అనే ఓ చిన్న మారుమూల గ్రామం నుంచి నాన్నగారు ఈ స్థాయికి ఎదిగారు. ఆయన ఎదిగే క్రమంలో పడిన కష్టాలు గుర్తోస్తే ఎమోషనల్ అవుతుంటాను.
మా నాన్నని ఏది అడిగే హక్కు నాకు లేదు. ఇంతల పేరు, ప్రఖ్యాతలు అన్నీ ఇచ్చారు. వీటిని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రమే నాకు ఉంది. మా నాన్నను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నాను” అని మంచు లక్ష్మీ చెప్పారు. ఇక ఈ హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి.. ఇంద్రభవనం లాంటి మంచు వారి ఇంటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.