బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులో అయిదు సీజన్లని పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓటీటీలో నాన్ స్టాప్ పేరిట 24/7 టెలికాస్ట్ అవుతుంది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వారంతా బయటకి వచ్చాక సెలబ్రిటీలుగా మారిపోతారు. కాస్తో కూస్తో బిగ్‌బాస్ ఫేమ్.. కంటెస్టెంట్స్‌కి ఉపయోగపడుతుంది. లహరి షారికి కూడా బిగ్‌బాస్ ఇలానే కలిసి వచ్చింది. ఐదో సీజన్‌లో ఈమె పాల్గొన్నది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో తక్కువ రోజులే ఉన్నది.. కానీ యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన రచ్చ.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక హౌజ్‌లో ఉన్నప్పుడు ప్రియ.. లహరి షారి గురించి చేసిన కామెంట్స్, ఆ తర్వాత రవికి, లహరికి మధ్య నడిచిన ఇష్యూ.. బాగానే వైరల్ అయ్యింది. లహరి బిగ్ బాస్ హౌజ్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉంది. హౌజ్‌మెట్స్‌తో ఏమో కానీ.. హోస్ట్ నాగార్జునకి బాగా క్లోజ్ అయింది కూడా.
తాజాగా లహరి షారి నాగార్జునని కలిసింది. నాగార్జునని మరోసారి కలిసినట్టు ఫోటో షేర్ చేసి.. ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అంటూ పోస్ట్ చేసింది. ఇక నాగార్జునతో డ్రైవింగ్ కి కూడా వెళ్ళింది లహరి. అందుకు సంబంధించిన ఫొటోలను.. నాగార్జున సార్‌తో డ్రైవింగ్‌కి వెళ్ళాను అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. నాగార్జునతో కార్లో కూర్చుని ఉన్న ఫొటోలు పోస్ట్ చేయడంతో.. లహరి సూపర్ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై చాలా మంది విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో నాగార్జునతో డ్రైవింగ్ గురించి సుమన్ టీవీకిచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది లహరి షారి. ఇక బిగ్‌బాస్ ఓటీటీలోకి ఎందుకు వెళ్లలేదో చెప్పుకొచ్చింది. అలానే కార్లో ఇంటర్వ్యూ చేసిన ఐడియా ఎలా వచ్చింది వంటి వివరాలును వెల్లడించింది లహరి షారి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. లహరి షారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.