పాత తరం నటుల్లో ఒకరు కుట్టి పద్మిని, మూడు నెలల ప్రాయంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ప్రస్తుతం వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా మారారు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా చైల్ఢ్ ఆర్టిస్ట్‌గా ఎక్కువగా కుట్టి పద్మినే కనిపించేవారు. అంతలా ఆమెకు డిమాండ్ ఉండేది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆమె నటించారు. కుళంద్యం దైవమమ్ అనే సినిమాకు గానూ ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె తల్లి రాధ కూడా పాత తరం నటి. సావిత్రి, రాధ మంచి స్నేహితులు కావడంతో పద్మిని మూడు నెలల వయసులోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. సావిత్రి చిన్నప్పటి పాత్రలో ఎక్కువగా నటించారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ ఇప్పుడు పోషిస్తున్న ఆ పాత్రను తాను గతంలో పోషించానని కుట్టిపద్మిని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన శకుంతలంలో తాను భరతుడు క్యారెక్టర్ పోషించనన్నారు. అర్హ చాలా క్యూట్ గా ఉందని మెచ్చుకున్నారు. అప్పట్లో నిజమైన పులిపై తాను నటించానన్నారు. అప్పట్లో తాను బిజీ ఆర్టిస్ట్ నని చెప్పారు. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. తనకు రెండు సార్లు వివాహం జరిగిందన్నారు. మొదటి భర్త తాగుడుకు బానిస కావడంతో వేరు పడ్డామని చెప్పారు. ఆ తర్వాత ప్రభు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగిందన్నారు. మాకు ఇద్దరు పిల్లలు పుట్టారన్నారు. అయితే తన మొదటి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి, మేమే తీసుకువచ్చి, మా ఆఫీసు కింద రూమ్ కట్టి, చూసుకున్నామని, స్నేహితుడిగా ఉండేవారని, గత ఏడాదే అతడు కాలం చేశారని చెప్పారు. తప్పేనేది జరగుతుంటుందని, అతడు కష్టంలో ఉన్నాడని తెలిసి, సాయం చేయాలని భావించాలని అన్నారు.
మరొకరితో జీవితం పంచుకున్నాక.. మొదటి భర్తతో బెడ్ ను పంచుకోలేను కానీ, అలా వదిలేయాలని అనిపించలేదన్నారు. ఆఫీసులో ఉద్యోగం ఇచ్చి రూ. 30 వేలు జీతం ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా చాన్నాళ్లు కాపురం చేశాక తన రెండో భర్త ప్రభు..తన సెక్రటరీతో లవ్‌లో పడ్డారని, తాను వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు అంగీకరించానని, కానీ తన పిల్లలు ఒప్పుకోలేదని తెలిపారు. మమ్మల్ని వదిలేసి, ఆయన సెక్రటరీని వివాహం చేసుకున్నారన్నారు. తాను ఒంటరిగా ఉంటున్నానని, ఆయనప్పటికీ ఆనందంగా ఉన్నానన్నారు. తన కుమార్తెల్లో ఒకరూ లాయర్ అని, అన్ని లాజిక్ లు మాట్లాడుతుందని అన్నారు. మొదట్లో సొసైటీ గురించి భయపడ్డానని, తర్వాత సొసైటీ కూడు పెట్టదని తెలుసుకునన్నారు. తనకు తన పిల్లలే తనకు బలమన్నారు. గతంలో తాను హీరోయిన్ కావాలనుకున్నప్పుడు అడ్జస్ట్‌మెంట్ అడిగినట్లు చెప్పారు. చిన్న, చిన్నదుస్తులు వేసుకోవడం ఇష్టం లేక కూడా హీరోయిన్ ఛాన్సులు వదులుకున్నానని, అయినప్పటికీ.. తాను పది మందికి పని కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మానవత్వం మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇంతలా సాయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.