కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ వచ్చిన గుర్తింపు కంటే.. ఆ షో, దాని నిర్వాహకుల మీద చేసిన కామెంట్స్ ద్వారా మరింత ప్రచారం సంపాదించుకున్నాడు. జబర్దస్త్ మానేసిన తర్వాత.. కొన్నాళ్ల పాటు.. స్టార్ మాలో కామెడీ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆర్పీ. ప్రసుత్తం బుల్లితెరకు దూరమైన ఆర్పీ.. హైదరాబాద్‌లో సొంతం వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాన్‌వెజ్ ప్రియులు కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ ఒపెన్ చేశాడు. వ్యాపారం బాగా సాగుతుందని తెలిపిన ఆర్పీ.. రోజుకు ఏకంగా 2 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. కస్టమర్లు కూడా పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకు షాప్‌కు సంబంధించిన వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. మరి ఇంత బాగా రన్ అవుతున్న షాప్‌ను క్లోజ్ చేశాడు ఆర్పీ.. ఎందుకంటే..
కిరాక్ ఆర్పీ హైదరాబాద్‌లో ఒపెన్ చేసిన నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసుకు విపరీతమైన డిమాండ్ వచ్చంది. ఇక్కడ చేపల పులుసును రుచి చూసేందుకు.. నగరంలో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కస్టమర్లు ఆర్పీ షాప్‌కు క్యూ కడుతున్నారు. రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తన షాప్‌కి వచ్చే వాళ్లందరికి.. వారు అడిగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు ఆర్పీ. ఈ క్రమంలో కస్టమర్ల తాకిడి తట్టుకోలేక.. ఏకంగా వారం రోజుల పాటు షాప్ మూసేసి.. పని వాళ్ల కోసం నెల్లూరుకు వచ్చేశాడట. నెల్లూరులో చేపల పులుసు వండే వారితో పాటు.. హోటల్‌లో పని చేసేవారి కోసం వెతుకుతున్నాడట.
చేపల పులుసు అద్భుతంగా చేసే వారికి.. తన దగ్గర ఉపాధి కల్పించడమే కాక.. వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానని భరోసా ఇస్తున్నాడు ఆర్పీ. నెల్లూరు మహిళలు చేపలు కడిగే పద్దతి.. మిగతా వారి కంటే భిన్నంగా ఉంటుంది. అలానే వారు కట్టెల పొయ్యి మీద చేపల పులుసు చేస్తారు. దానివల్లే నెల్లూరు పేరు చెప్పగానే.. చాలా మందికి చేపల పులుసు గుర్తుకు వచ్చి.. నోట్లో నీళ్లురుతుంటాయి. ఇక తన వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపిన ఆర్పీ.. మ్యాన్ పవర్ కొరత కారణంగా.. డిమాండ్‌కు సరిపడా.. కస్టమర్లకు ఐటెమ్స్ అందించలేకపోతున్నామని.. చాలా మంది వెనుతిరిగి వెళ్తున్నారని చెప్పుకొచ్చాడు ఆర్పీ. కస్టమర్లు అలా నిరాశగా వెళ్తుంటే తనకు బాధగా ఉందని.. త్వరలోనే నెల్లూరు నుంచి వంట మాస్టర్లు, వర్కర్లను.. హైదరాబాద్ తీసుకువచ్చి.. కర్రీ పాయింట్ తిరిగి తెరుస్తాను అంటున్నాడు ఆర్పీ.