సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు అనేవి అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అదీగాక ముప్పై ఏళ్ళు దాటాక అభిమాన సినీతారలు ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని ఎదురు చూస్తుంటారు. అయితే.. లాక్ డౌన్ సమయం నుండి ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా అందరు స్టార్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. కొంతమంది ప్రేమలో ఉన్నారు.. మరికొందరు సహనటులతో డేటింగ్ చేస్తూ ఊరిస్తున్నారు. కొన్ని జంటలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాయంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో చేరిన జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా.
కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. మహేష్ బాబు సరసన భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలు చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ – శంకర్ మూవీలో కూడా నటిస్తోంది. అయితే.. కొన్నేళ్లుగా కియారా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాలో ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ బీచ్, పార్టీలు, పబ్బులంటూ తిరిగేస్తున్నారు. తీరా ప్రేమ, పెళ్లి గురించి అడిగేసరికి దాటవేయు సమాధానాలు చెబుతూ వచ్చారు. కానీ.. రీసెంట్ గా కరణ్ జోహార్ షోలో పాల్గొన్న కియారా.. సిద్ధార్థ్ తనకు చాలా స్పెషల్ అని, ఫ్రెండ్ కంటే ఎక్కువని చెప్పి సర్ప్రైజ్ చేసింది.
దీంతో త్వరలో కియారా – సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్.. బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక కియారా, సిద్దార్థ్ కూడా ప్రస్తుతం చేతుల్లో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్ లో పెళ్లి చేసుకునే ప్లాన్ లో ఉన్నారని సమాచారం. మరి కియారా, సిద్దార్థ్ ఇద్దరిలో ఏ ఒక్కరూ పెళ్లిపై ఓపెన్ అవ్వలేదు. కానీ.. బయట చూస్తే క్లోజ్ గా ఉండటం, పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టడం విచిత్రంగా ఉందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ లో స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. చూడాలి మరి వచ్చే ఏడాది కియారా, సిద్దార్థ్ ల జంట ఒక్కటవుతుందేమో!
POV :- Sidharth and and Kiara are preparing for their wedding functions 💘
God, please get them marry ASAP😭 #SidharthMalhotra #KiaraAdvani #SidKiarapic.twitter.com/4BbFogGwTc
— Sanskruti (Inactive Era ) ❤ (@engg_sanu) October 12, 2022
Hello, gorgeous!🤍#KiaraAdvani looks stunning in her latest clicks. pic.twitter.com/PbKMCiUc5F
— Filmfare (@filmfare) October 12, 2022