సాధారణంగా సోషల్ మీడియాలో ఫేమ్ అయినవారు షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించడం మామూలే. షార్ట్ ఫిలిమ్స్ తో పాటు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్స్, ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటారు. అయితే.. ఇవన్నీ చేసి సినిమాలలో ఎంట్రీ ఎప్పుడు ఇస్తారనేది సస్పెన్స్. కొందరు టిక్ టాక్ వీడియోస్ ద్వారా కూడా హీరోయిన్స్ అయిపోయారు. అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు. కానీ.. కొందరు వివాదాల ద్వారా వెలుగులోకి వస్తుంటారు. ఆ వివాదాలతోనే పాపులర్ అవుతుంటారు.
ఇటీవల ఓ పబ్ వివాదం ద్వారా ఫేమ్ అయ్యింది సోషల్ మీడియా స్టార్ ఖుషిత కళ్లపు. ఈమె పేరు చెబితే అందరూ గుర్తించకపోవచ్చు. అయితే.. పబ్ కి బజ్జీలు తినడానికి వెళ్ళాం అని చెప్పి ‘బజ్జీల పాప’గా పాపులర్ అయినా అమ్మాయంటే ఇట్టే గుర్తుపడతారు. ఇక సోషల్ మీడియా క్రేజ్ తో ఇంస్టాగ్రామ్ రీల్స్, పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఖుషిత.. అదృష్టం నక్కతోక తొక్కిందని అంటున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే.. ఖుషిత ఇప్పుడు బజ్జీల పాప కాదు సినిమా హీరోయిన్.
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఇటీవలే సొంత ప్రొడక్షన్ సంస్థ ఆర్‌టి టీమ్ వర్క్స్ స్టార్ట్ చేసిన విషయం విదితమే. ప్రతిభ ఉన్న కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ.. కంటెంట్ సినిమాలు నిర్మించేందుకు రెడీ అయిపోయాడు. రవితేజ ప్రొడక్షన్ లో నాలుగో సినిమాగా ‘ఛాంగురే బంగారురాజా’ పూజా కార్యక్రమం జరుపుకుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్నాడు.
ఇక కార్తీక్ సరసన హీరోయిన్ గా ఖుషిత కళ్లపు అదేనండీ బజ్జీల పాప నటించనుంది. పూజా కార్యక్రమానికి రవితేజ ఫ్యామిలీ కూడా హాజరైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలు కానుంది. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ గా ‘ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ సినిమాను రవితేజ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. అంటే.. మొత్తానికి మాస్ రాజా సినిమా ద్వారా ఖుషిత హీరోయిన్ గా లాంచ్ అవ్వబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి బజ్జీల పాప అలియాస్ ఖుషిత హీరోయిన్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#changurebangaruraja new project, yellow Thursdays! With @RaviTeja_offl deeply humbled! 😄 pic.twitter.com/qjT5gBt2xm
— Kushithakallapu (@kushithakallapu) August 11, 2022
#ChangureBangaruRaja launched today with a formal pooja and I’ve never been happier and privileged to learn from @RaviTeja_offl sir, the switch by @TheVishnuVishal sir and the script by @BvsRavi sir and @sudheerkvarma sir- first shot direction. Feeling very blessed and humbled! pic.twitter.com/J5vTAAKO8l
— Kushithakallapu (@kushithakallapu) August 11, 2022