జబర్దస్త్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడైతే జబర్దస్త్ వచ్చిందో అప్పటి నుంచి చిన్న పిల్లలు సైతం పంచులు వేడయం ప్రారంభించారు. దాంతో అంతా జబర్దస్త్ మహిమ అనుకోవడం పెద్దవాళ్ల వంతైంది. ఇక ఈ షో ద్వారా పరిచయం అయిన కమెడీయన్ లు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటి కప్పుడు సరికొత్త స్కిట్స్ తో ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించటంలో జబర్దస్త్ ఎప్పుడు ముందుంటుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అక్టోబర్ 21కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఎప్పటిలాగే తమదైన పంచులతో అందరు కడుపుబ్బా నవ్విస్తే.. సీనియర్ నటి కుష్బూ మాత్రం తన హెయిర్ డ్రెస్సర్ ను తలచుకుని కంటతడి పెట్టింది. దాంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
ఖుష్బూ.. తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కలియుగ పాండవులు, పేకాట పాపారావు, స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమెపై అభిమానంతో అభిమానులు గుడినిసైతం కట్టారు. సినిమాలు చేయడం తగ్గించిన తర్వాత క్రమంగా రాజకీయాలకు దగ్గరైయ్యారు. అయినప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఖుష్బూ తన హెయిర్ డ్రెస్సర్ ను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.
యాంకర్ రష్మీ ఖుష్బూ గారు మీరు మళ్లీ జీవితంలో వెనక్కి వెళ్తే ఏం కోరుకుంటారు అని అడగ్గా.. కుష్బూ సమాధానం ఇస్తూ..” నేను 1984లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పుడు నాతో ఉబెన్ ఆంటీ వచ్చారు. ఆమె నా హెయిర్ డ్రెస్సర్. అప్పటి నుంచి 2011 వరకు నా దగ్గరే ఉంది. కానీ క్యాన్యర్ తో ఆమె చనిపోయింది” అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. జీవితంలో వెనక్కి వెళితే నేను ఆమె చనిపోకూడదు అని కొరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు తమతో,తమ కోసం పనిచేసిన వారికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం కూడా మనం ఇండస్ట్రీలో చూశాం. అయితే ఈ మధ్య కాలంలోనే ఖుష్బూ వెన్నముక సమస్య కారణంగా ఆస్పత్రి పాలైన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ప్రోమోలో జడ్జిగా కృష్ణభగవాన్ వేసిన పంచులు హైలెట్ అని చెప్పాలి.