‘ఆది పురుష్’ ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉండేవి. ఓం రౌత్ కలకల ప్రాజెక్టు అని చెప్పడం, మొదటిసారి ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అంతా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఇటీవలే ఆ సినిమా టీజర్ రానే వచ్చింది. కానీ, ఆ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచకపోగా తీవ్రంగా ట్రోలింగ్ గురవుతోంది. ఓం రౌత్ ఏం చెప్పి ప్రభాస్‌ని ఒప్పించాడో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదంటున్నారు. ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు అన్నీ గల్లంతు అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా టేకింగ్, యానిమేషన్, మోషన్ క్యాప్చరింగ్ విషయంలో జరిగింది. ఇక ఇప్పటి నుంచి పాత్రల విషయంలోనూ ప్రజలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వినిపించడం ప్రారంభించారు.
ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ చేస్తున్న లంకేశుడి పాత్రను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆయన రావణాసురుడా? లేక పద్మావత్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. బులుగు రంగు సూట్, పెద్ద గడ్డం, కళ్లకు కాటుక పెట్టి సైఫ్ అలీ ఖాన్‌ను రావణాసురిడిగా చూపించడాన్ని తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై కేజీఫ్ నటి, బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణాన్ని ఓం రౌత్ తప్పుదోవ పట్టిస్తున్నారన్ని ఆరోపించారు. ఓ వార్తా ఏజెన్సీతో ముచ్చటించిన సందర్భంలో మాళవిక అవినాష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
#Adipurush @omraut Ravana in your cinema is like Mughal Ravana! A true Ravana is a true devotee of that Supreme Lord.He below is the Ravana Brahma we know! pic.twitter.com/N5XBbHZP7g
— జగదీశ్ నాయుడు (@jagadeeshDogga) October 4, 2022
“రామాయణం మన దేశంలోనే కాదు.. థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియాలోనూ ప్రాచుర్యంలో ఉంటుంది. అంతేకాకుండా వాల్మీకీ రామాయణం, కంబ రామాయణం, తులసీదాస రామాయణంలోనూ రావణాసురుడు ఎలా ఉండేవాడో వివరించారు. అంతేకాకుండా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రామాయణం గురించి ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో రావణుడి పాత్రలో ఎంతో గొప్ప నటులు నటించి మెప్పించారు. కనీసం ఓం రౌత్‌గారు మన సినిమాలను కూడా చూడలేకపోయారు. భూకైలాష్ సినిమాలో దిగ్గజ నటులు ఎన్టీ రామారావునో, రాజ్‌కుమార్‌నో చూస్తే సరిపోతుంది కదా. సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు గారు నటించిన రావణుడి పాత్రను చూసినా సరిపోతుందిగా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది పురుష్‌లో లెదర్ జాకెట్ వేసుకుని.. విదేశీయుడిలా ఉన్నాడు గానీ, రావణుడిలా అనిపించడం లేదంటూ మాళవిక చెప్పుకొచ్చారు.
Ravana,a Shiva-Bhakta Brahmin from Lanka had mastered the 64 arts!Jaya(Vijay) who was guarding Vaikunta descended as Ravana owing to a curse!
This may be a Turkish tyrant but is not Ravana!
Bollywood,Stop misrepresenting our Ramayana/History!Ever heard of the legend NTRamaRao? pic.twitter.com/tGaRrsSQJW— Malavika Avinash (@MalavikaBJP) October 3, 2022