ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టోర్నీ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలువకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ రేంజ్ లో ఉంటుంది. తాజాగా.. ఆ అభిమానుల జాబితాలోకి కేజీఎఫ్- 2 చిత్ర యూనిట్ చేరిపోయింది. మంగళవారం(ఏప్రిల్ 19).. ఆర్సీబీ జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచుకు కేజీఎఫ్- 2 సినిమాలో నటించిన.. అధీర(సంజయ్ దత్), రమికా సేన్(రవీనా టాండన్) హాజరుకానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హొంబలె ఫిల్మ్స్ ప్రకటించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శాండిల్‌వుడ్ సినిమా ‘కేజీఎఫ్’ బాక్సాఫీక్ వద్ద ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో కన్నడ హీరో ‘యశ్’ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక.. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’.. సినీ ఇండస్ట్రీలో ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. శాండిల్‌వుడ్‌లో టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయిన హొంబలె ఫిల్మ్స్.. ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’తో జతకట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. మంగళవారం(ఏప్రిల్ 19) జరగనున్న ఆర్సీబీ, లక్నో.. మ్యాచుకు కేజీఎఫ్- 2 సినిమాలో నటించిన.. అధీర(సంజయ్ దత్), రమికా సేన్(రవీనా టాండన్) హాజరు అవుతున్నట్లు.. నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Adheera & Ramika Sen Joining the @RCBTweets team for Today’s match 💥
Time to fire some shots tonight!@hombalefilms @TheNameIsYash @prashanth_neel @duttsanjay @TandonRaveena @VKiragandur @ChaluveG#ನಮ್ಮHombale #ನಮ್ಮRCB #RCBxHombale #PlayBold #PlayToofani #KGFChapter2 pic.twitter.com/i6x98iAe52— Hombale Films (@hombalefilms) April 19, 2022
ఇది కూడా చదవండి: తన జీవితంలోని చీకటి కోణంపై సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్!
ఇక కేజీఎఫ్ సినిమా విషయానికొస్తే.. ఎంతో బలంగా, కట్టుదిట్టంగా రాసుకున్న కథ, కథనానికి అదే రేంజ్ హీరో దొరికితే ఎలా ఉంటుందో కేజీఎఫ్ ఛాప్టర్-2లో చూడచ్చు. 20 వేల మంది కార్మికులు, 2 వేల మంది ప్రైవేట్ సైన్యం మధ్యకు వెళ్లి అతని స్థావరంలోనే గరుడను రాఖీ హత్య చేయడంతో కేజీఎఫ్ సినిమా ముగిసింది. ఆ తర్వాత రాఖీ ఆ సామాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక కొత్త సుల్తాన్ గా అవతరించడంతో ఈ ఛాప్టర్-2 మొదలవుతుంది. చనిపోయాడనుకున్న అధీరా(సంజయ్ దత్) తిరిగి రావడంతో రాఖీకి అసలు పోటీ వచ్చినట్లైంది. అధీరా కథలోకి వచ్చిన కాసేపటికే రాఖీ ఒంట్లో బులెట్ దింపి.. ప్రాణ భిక్ష పెడతాడు. మొత్తం సామ్రాజ్యం ప్రమాదంలో పడుతుంది. పరిస్థితులు చేదాటిపోతాయి. అప్పుడు రాఖీ వాటిని ఎలా చక్కదిద్దాడు.. తన ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది కథ.
అధీరాను కూడా రాఖీకి ఏ మాత్రం తగ్గకుండా చూపించాడు. ‘నేను కొట్టిన ప్రతి వాడు డానే’.. అని రాఖీ చెప్పే డైలాగ్‌కు తగ్గట్లుగా అతనికి ఎదురయ్యే ప్రతి వ్యక్తిని అదే స్థాయిలో చూపించాడు. ఒక వ్యక్తి దేశానికే ఎదురెళ్లడం.. దేశ ప్రధానికే సవాలు విసరడం అనేది ఊహించుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా కాకుండా నమ్మసక్యంగానే కథను ముందుకు నడిపించాడు ప్రశాంత్ నీల్. అధీరా పాత్రలో సంజయ దత్, ప్రధాని పాత్రలో రవీనా టాండన్.. జీవించారని చెప్పొచ్చు.
To the world we present the much awaited magnum opus #KGFChapter2#KGF2InCinemas near you.@Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena@SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd pic.twitter.com/uQptYdnPSZ
— Hombale Films (@hombalefilms) April 14, 2022
ఇది కూడా చదవండి: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.