ఆమె ఓ డైరెక్టర్. తను తీయబోయే సినిమాల కోసం ఓ యువ నటుడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఓ ఊరిలో షూట్ కూడా ప్లాన్ చేశారు. అంతా అనుకున్నట్లుగానే జరిగిపోయింది. కట్ చేస్తే ఆ నటుడు.. సదరు మహిళా దర్శకురాలిపై కేసు పెట్టాడు. తనతో బలవంతండా అడల్ట్ చిత్రాల్లో నటించేలా చేశారని ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై కేసు పెట్టి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి కాస్త ఈ వార్త చదివే మిమ్మల్ని తికమక పెట్టొచ్చు. ఎందుకంటే ఇద్దరూ కూడా ఎవరికీ వారే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఏదో నిజమే తేల్చే పనిలో పోలీసులు పడ్డారు.
ఇక విషయానికొస్తే.. కేరళకు చెందిన ఓ యువ నటుడు సంచలన ఆరోపణలు చేశాడు. అగ్రిమెంట్ విషయంలో తనని మోసగించి డర్టీ పిక్చర్స్ లో నటించేలా బలవంతం చేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో వారు దర్యాప్తు చేపట్టారు. ‘అది నా తొలి షూట్. అందుకే అగ్రిమెంట్ సరిగా చదవకుండా సంతకం చేశాను. షూటింగ్ కోసం వారితో వెళ్లాను. నన్ను ఓ రూంకి తీసుకెళ్లారు. అది అడల్ట్ చిత్రమని, నగ్నంగా నటించాలని చెప్పారు. నేను నిరాకరించాను. వాళ్లు బలవంతం చేశారు. అగ్రిమెంట్ తప్పితే రూ.5 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఓ పల్లెటూరిలో జరిగింది. అందుకే నేను పారిపోలేకపోయాను. ఈ ఫిల్మ్ విడుదలైతే నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కి ఎలా ముఖం చూపించాలో తెలియట్లేదు’ అని యువ నటుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై మాట్లాడిన లేడీ డైరెక్టర్ మాత్రం నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే.. నగ్నంగా నటించాలనే విషయం చెప్పాం. అతడి అంగీకారం తీసుకునే సినిమా షూట్ చేశాం. ఇతడు మాత్రమే కాదు సినిమాలో యాక్ట్ చేసిన వారందరి నుంచి తమ తమ కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకున్నాం. ఆ ఒప్పందంపై సంతకాలు చేయడం వీడియో తీశాం’ అని సదరు మహిళా డైరెక్టర్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఇష్యూ కాస్త చర్చనీయాంశమైంది. మరి మహిళా దర్శకురాలు.. నటుడిపై గొడవ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.