Kamal Haasan: భారత దేశం గర్వించ దగ్గ మేటి నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. నటన పరంగా ఆయన సాధించిన ఘనత మరువలేనిది. కమల్ నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు పొరుగు రాష్ట్రం అయిన కేరళలో కూడా. ఆయన సినిమాలకు తమిళనాడు తర్వాత కేరళలో మంచి డిమాండ్ ఉంది. కలెక్షన్ల పరంగా కూడా తమిళనాడు తర్వాత కమల్ సినిమా ఇక్కడే ఎక్కువ వసూళ్లు సాధిస్తుంటాయి. తాజాగా, కేరళ కమల్ ఫ్యాన్స్.. లోకనాయకుడిపై తమ అభిమానాన్ని ప్రత్యేక రీతిలో చాటుకున్నారు.
నీటిపై ఓ అద్భుతాన్ని సృష్టించారు. ఇంతకీ సంగతేంటంటే.. కేరళకు చెందిన డావిన్సి సురేష్ అనే పేయింటింగ్ ఆర్టిస్ట్ వినూత్న రితీలో కమల్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ ఆర్ట్‌కు తెరతీశాడు. నీటిపై కాగితాలతో కమల్ చిత్రాన్ని రూపొందించాడు. దాదాపు 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న చిత్రాన్ని రూపొందించాడు. మున్నార్‌లోని వైబ్ రిసార్ట్ ఇందుకు వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డావెన్సీ సురేష్ రూపొందించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టు కుంటోంది. ఇక, కమల్ ఫ్లోటింగ్ ఆర్ట్ డావిన్సి సురేష్ రూపొందించిన 84 చిత్రం కావటం విశేషం. కాగా, ‘విక్రమ్’తో భారీ హిట్టును అందుకున్నారు కమల్. ఈ సినిమాలో తన నటనతో అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులను సృష్టించింది. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరి, కమల్ ఫ్లోటింగ్ ఆర్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
From the heart of Kerala Boys to UlagaNayagan @ikamalhaasan!!#KamalHassan #Vikram pic.twitter.com/VRo7E6Dtoc
— Rakesh Ramachandran (@RakeshRamachan) July 3, 2022
ఇవి కూడా చదవండి : Dil Raju: కొడుకుని చూస్తూ మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ అవుతున్న ఫొటో!