హీరో నాని గురించి చాలామందికి తెలుసు. బట్ హీరోయిన్ కీర్తి సురేష్.. అతడి గురించి ఓ సీక్రెట్ ని బయటపెట్టింది. నాని ధ్యాస ఎప్పుడూ అదేనంటూ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడటం కాస్త కష్టమైనా విషయం. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ లాంటి వాళ్లు దాన్ని రియాలిటీలో చేసి చూపించారు. ఆ లిస్టులో నాని పేరు కూడా కచ్చితంగా ఉంటుంది. పక్కింటి కుర్రాడు తరహా రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నాని.. నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇకపోతే నాని గురించి తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాని హీరోగా బాగానే పేరు తెచ్చుకున్నాడు. అదే టైంలో అతడికి ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. హీరోల దగ్గర నుంచి తనతో కలిసి పనిచేసిన హీరోయిన్ల వరకు అందరితో సత్సంబంధాలు మెంటైన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్లు నివేదా థామస్, నజ్రియా, కీర్తి సురేష్.. నాని బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో కచ్చితంగా ఉంటారు. అలా తాజాగా నాని పుట్టినరోజు జరగ్గా చాలామంది సెలబ్రిటీలు అతడికి విషెస్ చెబుతూ పోస్టులు పెట్టారు. కానీ కీర్తి సురేష్ పోస్ట్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
‘హ్యాపీ బర్త్ డే టూ మై ఫ్రెండ్, వెల్ విషర్, కో స్టార్.. ఎప్పుడూ సినిమా సినిమా అంటూ దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. మనకు ఇంకా 40 రోజులే ఉంది. కొంత సెలబ్రేషన్స్ ని తర్వాత కోసం దాచిపెట్టుకుందాం. 2023 కుమ్మేసేయ్ ధరణి’ అని కీర్తి సురేష్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ‘నేను లోకల్’ మూవీ కోసం తొలిసారి కలిసి నటించిన నాని-కీర్తి.. ‘దసరా’ సినిమా కోసం మరోసారి కలిసి వర్క్ చేశారు. మార్చి 30న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా అంతా కూడా గోదావరిఖని బ్యాక్ డ్రాప్ తో తీశారు. ఇందులో నాని-కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్స్ లో కనిపిస్తూ సినిమాపై అంచనాల్ని ఓ రేంజులో పెంచేస్తున్నారు.