Karate Kalyani: నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని కొట్టడంతో మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవటం.. ఒకరిని ఒకరు బూతులు తిట్టుకుంటూ ఆరోపణలు చేసుకోవటం జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కరాటే కళ్యాణి చట్ట వ్యతిరేకంగా ఓ బిడ్డను దత్తత తీసుకుందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కళ్యాణి ఓ రోజు మొత్తం కనిపించకుండా పోవటం అనుమానాలకు దారి తీసింది. ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె దత్తతపై క్లారిటీ ఇచ్చారు. తాను ఆ పసిబిడ్డను దత్తత తీసుకోలేదని చెప్పారు. మంగళవారం కళ్యాణి, తన లాయర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. దత్తత విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను ఆ ఐదు నెలల చిన్నారిని దత్తత తీసుకోలేదు. నాకు కలెక్టర్ నుండి కానీ, సీడబ్ల్యూసీ నుండి కానీ, ఎలాంటి నోటీసులు రాలేదు ఇవ్వలేదు. దత్తత వ్యవహారం పై కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చాను. ఈరోజు సీడబ్ల్యూసీ అధికారులు లేక పోవడంతో రేపు విచారణకు పిలిచారు. నా దగ్గర ఉన్న పాపను దత్తత తీసుకున్నట్లు శివ శక్తి సంస్థ వాళ్లు కావాలనే ప్రచారం చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ నేతలు, అధికారులు నాపై కక్ష సాధిస్తున్నారు. నేను దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడింది వాస్తవమే. కానీ, నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఆ మాట చెప్పాను. కావాలనే నాపై కుట్ర చేసి, కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను దత్తత తీసుకోలేదు. ఇంతటితో సమస్యకు పులి స్టాప్ పడాలి. దత్తత అనే అంశమే లేనప్పుడు ఇంకా కేసులు ఏంటి?.
ఆ చిన్నారి నాతోపాటు పేరెంట్స్‌తో కలిసి ఉంటుంది. కావాలనే ఎవరో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు ఎవరు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కలెక్టర్‌ను కూడా కలిశాను. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ వాళ్ళని కలవడానికి వచ్చాను. అధికారులు అందుబాటులో లేరు. ఇక్కడికి ఇష్యూ క్లోస్. నేను దత్తత తీసుకోలేదు’’ అని అన్నారు. కరాటే కళ్యాణి లాయర్ మాట్లాడుతూ.. ‘‘ అసలు అది దత్తతే కానపుడు లీగలా?.. ఇల్లీగలా అన్న ప్రశ్న ఎక్కడిది. పాపను దత్తత తీసుకోలేదు. కలెక్టర్‌కి ఇదే విషయం వివరించాము. కలెక్టర్ కూడా ఇదే విషయం సీడబ్ల్యూసీ అధికారులకు చెప్పమని అన్నారు. సమస్య ఇంతటితో పులిస్టాప్ పడాలి. మీడియా వార్తలను వక్రీకరించి రాయొద్దు’’ అని కోరారు. మరి, కళ్యాణి, ఆమె లాయర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karate Kalyani: నేనెక్కడికి పారిపోలేదు.. అజ్ఞాతం వీడిన కరాటే కల్యాణి!