కరణ్ జోహార్.. ప్రముఖ నిర్మాత, వ్యాఖ్యాత గురించి దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన సినిమాలు తీసినా, కాఫీ విత్ కరణ్ చేసినా పాన్ ఇండియా లెవల్లో వైరల్ అవుతారు. ఇటీవలే లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టి నష్టాలు చవిచూసిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారని తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్లపై విమర్శలు గుప్పించారు. సత్తా లేకపోయిన కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు.
“కొందరు బాలీవుడ్ హీరోల వైఖరి వల్లే ఇండస్ట్రీకి నష్టాలు వస్తున్నాయి. గతేడాది భారీ బడ్జెట్ సినిమాల వల్లే ఇండస్ట్రీ నష్టపోయింది. ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ఆ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ని బట్టే చెబుతారు. బీ టౌన్ లో కొందరు స్టార్లు 5 కోట్లు ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేరు కానీ, సినిమాకి 30 నుంచి 40 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వారు స్టార్లు అనే భ్రమ నుంచి బయటకు రావాలి. వాస్తవాన్ని తెలుసుకోవాలి. బయట మిమ్మల్ని చూసేందుకు ఎగబడే జనాలను చూసి మీ స్టార్డమ్ ని లెక్కగట్టకూడదు. వారి సినిమాకి వచ్చే కలెక్షన్స్ ని బట్టే వారి రేంజ్ ఉంటుంది.
సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాదు. నేను నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో వరుణ్ ధావన్, ఆలియా, సిద్ధార్థ్ మల్హోత్రాని పరిచయం చేశాను. వాళ్లు ఇప్పుడు పెద్ద స్టార్లు అయ్యారు. సినిమాకి మంచి హిట్ టాక్ వచ్చింది. లాభాల సంగతి పక్కన పెడితే పెట్టుబడి కూడా రాలేదు. బిజినెస్ విషయానికి వస్తే బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది ఇలాంటి మాటలు మాట్లాడితే నన్ను చంపేస్తారేమో.. కానీ నిజం చెప్పాలి. సినిమా బడ్జెట్ లో చాలా వరకు హీరో రెమ్యూనరేషన్ కే వెళ్లిిపోతుంది. మరి వాళ్లకి ఓపెనింగ్స్ తెచ్చే సత్తా కూడా ఉండాలి మరి. కొందరు హీరోలు అయితే తాము స్టార్లు అనే భ్రమలో బతికేస్తున్నారు.
వాళ్లు ఆ భ్రమ నుంచి బయటకు వస్తే బావుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన కరణ్ జోహార్ బాలీవుడ్ తారలపై మాత్రం విమర్శలు గుప్పించారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ఉపయోగించుకుని కొత్త కొత్త తారలను పరిచయం చేస్తే బాగుంటుందని సూచించారు” ప్రస్తుతం కరణ్ జోహార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు. కానీ, కరణ్ జోహార్ వ్యాఖ్యలను ఎవరూ ఖండించరనే చెప్పాలి. ఎందుకంటే అది వాస్తవం.. కరణ్ ని ఎదిరించే ధైర్యం ఎవరూ చేయకపోవచ్చు.