భారత సినీ పరిశ్రమలో ‘కాంతార’ సినిమా ఓ సంచలన విజయాన్ని సాధించింది. ఓ చిన్న సినిమాగా తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కేవలం కన్నడలోనే కాదు విడుదలైన ప్రతీ భాషలో మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ప్రొడ్యూసర్లు మూడు, నాలుగింతలు లాభాలను మూటగట్టుకుంటున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులోనూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు దాదాపు 15 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాంతార ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవటంలో నటీనటుల నటన కీలక పాత్ర పోషించింది. అలాంటి నటనకు తెలుగు డబ్బింగ్ వర్సన్‌లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ప్రాణం పోశారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. కాంతార సినిమా తుళునాడుకు చెందిన ఓ సంప్రదాయ నృత్యం ఇతివృత్తంతో తెరకెక్కింది. ముఖ్యంగా ఇందులో తుళునాడు గ్రామీణ నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రలకు.. ముఖ్యంగా వేరే భాషతో ముడిపడి ఉన్న పాత్రలకు డబ్బింగ్ చెప్పటం చాలా కష్టం.
కానీ, తెలుగులో డబ్బింగ్ చెప్పిన వారు తమ నైపుణ్యంతో పాత్రలకు ప్రాణం పోశారు. కాంతార డబ్బింగ్ సినిమాలాగా అనిపించకుండా.. ఓ తెలుగు సినిమా అనిపించేలా తమ వాయిస్‌తో మాయ చేశారు. అద్భుతమైన తమ డబ్బింగ్ స్కిల్స్‌తో కాంతార సినిమాను తెలుగులో మరో లెవెల్‌కు తీసుకుపోయిన డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమన్ టీవీతో వారు తమ డబ్బింగ్ అనుభవాలను పంచుకున్నారు. కాంతార సినిమాకు డబ్బింగ్ చెప్పటం ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఇంకా వారు ఏమన్నారో ఈ వీడియో చూసి తెలుసుకోండి.