గతేడాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘కాంతార‘ ఒకటి. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ఈ సినిమాని కేజీఎఫ్, సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. కర్ణాటకలోని పుంజర్లి తెగకు సంబంధించిన ‘భూతకోల’ నృత్యం, సాంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమాని మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు రిషబ్ శెట్టి.
కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ సినిమాగా విడుదలై.. డబుల్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొట్టిన కాంతార నుండి మరో పార్ట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకి సీక్వెల్ లాంటివి ఏమి ఉండవని ఇదివరకే హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మీడియా ముఖంగానే చెప్పాడు. కానీ.. ఆడియెన్స్ డిమాండ్ వలన దీనికి పార్ట్ 2 రానుందని ప్రకటించారు. ఈ క్రమంలో జూన్ నుండి కాంతార సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. కాగా.. తాజా సమాచారం ప్రకారం.. కాంతార నుండి ముందుగా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ని తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
ఈ లెక్కన కాంతార ప్రీక్వెల్, సీక్వెల్స్ తో కలిపి మొత్తం మూడు భాగాలుగా రానుందని అంటున్నారు. అదీగాక ఇటీవల ఆస్కార్ కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలలో కాంతార కూడా ఉంది. దీంతో ఈ సినిమాపై అందరి దృష్టిపడింది. అయితే.. కాంతార ప్రీక్వెల్ లో ఏం చూపించనున్నారు? అనంటే.. హీరో తండ్రి జీవితం.. భూతకోల ప్రభావం.. హీరో తండ్రి అసలు ఏమైపోయాడు? అనే అంశాల చుట్టూ కాంతార ప్రీక్వెల్ రూపొందనుందట. ఇందులో భాగంగా రిషబ్ శెట్టి.. కర్ణాటకలోని కోస్టల్ ఏరియాలో షూటింగ్ కోసం ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడని ఇండస్ట్రీ టాక్.
ఇదిలా ఉండగా.. వరల్డ్ వైడ్ మంచి ఫేమ్, కలెక్షన్స్ సాధించిన కాంతార ప్రీక్వెల్ ని వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు యోచిస్తున్నారట. ఇక కాంతార మూవీలో భూతకోల నృత్యం, వరాహ రూపం సాంగ్, క్లైమాక్స్ మేజర్ హైలెట్స్ గా నిలిచాయి. కాగా.. ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించగా.. అజనీష్ లోకనాథ్ తన సంగీతంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. మరి మోస్ట్ ప్రాఫిటబుల్ హిట్ గా నిలిచిన కాంతార ప్రీక్వెల్, సీక్వెల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
As per recent article, Kantara 2 is happening & currently the team is researching the coastal regions to create another ದಂತಕಥೆ.
It is a prequel. Filming may start from June 2023 & plan of release is in Summer 2024.
+++Actors from other industries+++#Kantara2 Pan India 🍿💥 pic.twitter.com/SnPR91F6We
— Akhil Venkatesh (@AkhilVenkatesh9) January 21, 2023