చెత్త సినిమాలు తీసే సినిమా మాఫియా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేస్తుందని కంగనా అన్నారు. చిల్లర డబ్బుల కోసం ఆ మాఫియా ఐటమ్ సాంగ్స్ చేస్తుందని కూడా అన్నారు. వారికి నిజమైన మనుషుల గురించి తెలీదని, సమగ్రత డబ్బు కంటే విలువైనదని వెల్లడించారు.
బాలీవుడ్ కాంట్రవర్శియల్ హీరోయిన్ కంగనా రనౌత్ తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినా.. తన తల్లి మాత్రం ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతోందని, పొలం పనులు చేస్తోందని అన్నారు. తాను ఓ ఉన్నత కుటుంబానికి చెందిన దాన్నని చెప్పారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు ఆమె సమాధానం ఇచ్చారు. ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ ‘‘ నా వల్ల మా అమ్మ ధనవంతురాలు కాదు. ఇది గుర్తించండి. నేను రాజకీయ, వ్యాపార, ప్రభుత్వ అధికారులు ఉన్న కుటుంబంనుంచి వచ్చాను. మా అమ్మ దాదాపు 25 ఏళ్ల పాటు స్కూలు టీచర్‌గా పని చేశారు. నాకు ఈ యాటిట్యూడ్ ఎక్కడినుంచి వచ్చిందో సినిమా మాఫియా గుర్తించాలి.
నేను ఎందుకు పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసే లాంటి చిల్లర పనులు చేయాలి’’ అని అన్నారు. ఆదివారం ఆమె తన తల్లితో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ‘‘ మా అమ్మ ఇప్పుడు కూడా 7-8 గంటల పొలంలో పనిచేస్తుంది. మా అమ్మ బయట తినడాన్ని ఇష్టపడదు. విదేశాలకు రాదు. సినిమా సెట్లకు కూడా రాదు. నేను గనుక ఈ పనుల్ని చేయమని మా అమ్మను అడిగితే నన్ను తిడుతుంది’’ అని అన్నారు. మరో పోస్టులో.. ‘‘ చెత్త సినిమాలు తీసే సినిమా మాఫియా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేస్తుంది. చిల్లర డబ్బుల కోసం ఐటమ్ సాంగ్స్ చేస్తుంది. వారికి నిజమైన మనుషుల గురించి తెలీదు.
సమగ్రత డబ్బు కంటే విలువైనది. అందుకే నేను వాళ్లను గౌరవించట్లేదు. ఇకపై కూడా గౌరవించను కూడా’’ అని స్పష్టం చేశారు. కాగా, బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు కంగనా రనౌత్‌కు మధ్య చాలా కాలం నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. సదరు సెలెబ్రిటీలు తనను సినిమా ఇండస్ట్రీ నుంచి పంపించాలని చూస్తున్నారని కంగనా అన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆ వ్యక్తులపై ఫైర్ అవుతూ వస్తున్నారు. మరి, కంగనా రనౌత్ తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.