మనం సంపాదించేది ఆనందంగా బతకడానికే. సామాన్యుడు అయినా సెలబ్రిటీ అయినా సరే హ్యాపీనెస్ కోసమే సంపాదిస్తారు. తిండి, బట్టలు, ఇల్లు ఉంటే చాలు సంతోషంగా బతికేయొచ్చని అనుకుంటూ ఉంటారు. ఇక మనల్ని పెంచి పోషించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండాలని పలువురు కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే జీవితాంతం వాళ్లకు గుర్తుండిపోయే సర్ ప్రైజులు ఇస్తుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ అలానే తన తల్లికి లగ్జరీ బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చింది.
ఇక విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్లో కాజోల్ కూడా ఒకరు. స్టార్ హీరో అజయ్ దేవగణ్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. కెరీర్, ఫ్యామిలీ పరంగా ఫుల్ హ్యాపీగా ఉంది. మరోవైపు కాజోల్ చెల్లి తనీషా ముఖర్జీ కూడా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘కంత్రి’ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పెద్దగా సినిమాలేం చేయట్లేదు. ఇకపోతే క్రిస్మస్ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, తనీషా కలిసి.. తమ తల్లికి మరిచిపోలేని బహుమతి అందించారు. వీరిద్దరూ కలిసి ముంబయి సమీపంలోని లోనావాలా హిల్ స్టేషన్ లో విలాసవంతమైన బంగ్లా కట్టించారు. ఇంటి నిర్మాణానికి 8 నెలలు పట్టిందని, అప్పటివరకు తల్లికి విషయం తెలియనివ్వలేదని తనీషా చెప్పుకొచ్చింది.
ఇక ఆదివారం క్రిస్మస్ సందర్భంగా కొత్తింటికి వెళ్లిన కాజోల్-తనీషా.. తల్లి రిబ్బన్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన మొత్తం వీడియోని తనీషా తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. వీడియో చూసిన పలువురు ఫ్యాన్స్, నెటిజన్స్.. వాళ్లకు విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. తల్లీకూతుళ్ల మధ్య మంచి బాండింగ్ ఉందని, దాన్ని అలానే కంటిన్యూ చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా అజయ్ దేవగణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ కాజోల్ బిజీగా ఉంది. ఈ మధ్య ‘సలాం వెంకీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. నిర్మాతగా కూడా పలు సినిమాలు తీస్తోంది. మరి తల్లికి బంగ్లా ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.