కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అందరూ అగ్ర కథానాయకుల సరసన నటించింది. యువ హీరోల సరసన కూడా సందడి చేసింది. అయితే లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమా జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత భర్త, కొడుకే లోకంగా గడుపుతోంది. ఎప్పుడూ కొడుకుతో సరదాగా గడపడం, భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం చేస్తూ ఉంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరువు పెరిగిన కాజల్ ప్రస్తుతం మళ్లీ సన్నబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి వెండితెర మీదక తళుక్కుమనే సమయం కూడా దగ్గర్లోనే ఉందంటూ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వార్తలు కూడా బాగానే చక్కర్లు కొడుతున్నాయి.
కాజల్ అగర్వాల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది గానీ, తన అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటోంది. ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను, ముఖ్యమైన సమాాచారాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. వ్యాపారవేత్త కిచ్లు గౌతమ్ తో వివాహం నుంచి.. ప్రెగ్నెన్సీ, నెయిల్ కిచ్లూకి జన్మనివ్వడం వరకు అన్ని విషయాలను కాజల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూనే ఉంది. ఆ విధంగానే అభిమానులు కూడా కాజల్ ని చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటిసారి కాజల్ అగర్వాల్ పై అభిమానులు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన ఓ పోస్ట్ వల్ల ట్రోలింగ్ కి దిగారు. అసలు కాజల్ అగర్వాల్ కు బుద్ధి ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
విషయం ఏంటంటే.. క్రిస్మస్ సందర్భంగా అందరూ సెలబ్రిటీలు వారి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. వారి ఫొటోలను షేర్ చేసి అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాజల్ కూడా తన పర్సనల్ ఫొటోని షేర్ చేసింది. అది మరీ పర్సనల్ గా ఉంది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. తన భర్త గౌతమ్ కిచ్లుకి లిప్ లాక్ ఇస్తున్న ఫొటోని కాజల్ పోస్ట్ చేసింది. ఈ క్రిస్మస్ కి నాకు కావాల్సింది ఇదే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటో చూడగానే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు ముందే మీరు అలా లిప్ లాక్ పెట్టుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అది చూడలేకే నెయిల్ కిచ్లూ తల తిప్పుకున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవలే శ్రేయా కూడా పబ్లిక్ గా భర్తకు లిప్ లాక్ పెట్టి ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే.