తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో కాదంబరి కిరణ్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించిన ఈయన.. కేవలం నటుడిగానే కాకుండా మిగిలిన విభాగాల పరంగానూ యాక్టివ్ గా ఉంటున్నారు. అలా ‘మనం సైతం’ పేరుతో పలువురికి సాయం కూడా చేశారు. ఇలా చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన వారసులు మాత్రం ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఇకపోతే ఇద్దరు కూతుళ్లకు మాత్రం చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు.
ఇక విషయానికొస్తే.. దాదాపు 25 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్.. నటుడిగానే కాకుండా రైటర్, డైరెక్టర్ గానూ ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. గత కొన్నేళ్ల కాలంలో తీసుకుంటే.. రంగస్థలం, భరత్ అను నేను, శ్రీమంతుడు తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021 డిసెంబరులో పెద్దమ్మాయికి పెళ్లి చేసిన కిరణ్.. తాజాగా చిన్మమ్మాయి పెళ్లిని హైదరాబాద్ లో చేశారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో కోటా శ్రీనివాసరావు, అలీ, జేడీ లక్ష్మీ నారాయణ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.