ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఆమె గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు. తమకు జీవితా రాజశేఖర్.. రూ. 26 కోట్లు బకాయి పడ్డారంటూ ఇటీవల జోస్టర్ గ్రూప్ యాజమాన్యం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద జీవిత అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయగా.. అది బౌన్స్ అయ్యిందని జోస్టర్ గ్రూప్ సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంపై సంస్థ యాజమాన్యం నగరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జీవితా రాజశేఖర్ కు నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ వ్యవహారంపై గతంలో జీవిత స్పందించారు. జోస్టర్ గ్రూప్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేశారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో గురువారం జరిగిన కోర్టు విచారణకు జీవిత స్వయంగా తన తరపు న్యాయవాదులతో కోర్టుకి వచ్చారు. మరి జీవితా రాజశేఖర్ కోర్టుకు హాజరవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.