జాన్వీ కపూర్.. బోనీ కపూర్- శ్రీదేవీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ వరుస సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులు, ఫొటో షూట్లు, జిమ్ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అటు ఎంత మోడ్రన్ గా ఉంటుందో అంతే సంప్రదాయంగానూ ఉంటుంది.
ముంబైలో సినిమాలు, షూటింగ్స్ అంటూ ఎంత బిజీగా ఉన్నా కూడా ఏటా తిరుమలకు తప్పకుండా వస్తుంటుంది. తిరుమలకు వచ్చిన ప్రతిసారి పదహారణాల తెలుగమ్మాయిలో లంగాఓణీలో స్వామివారిని దర్శించుకుంటుంది. తాజాగా బులుగు రంగు లంగాఓణీతో జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గొంది.
సినిమాల విషయానికి వస్తే.. గుడ్ లక్ జెర్రీ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. మిస్టర్ అండ్ మిస్ మహి అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. బవాల్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంక టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇదిగో డెబ్యూ, అదిగో డెబ్యూ అంటున్నారు గానీ, ఎప్పుడనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Actress #JanhviKapoor Visits Trimula today 😍 pic.twitter.com/cvOiN07wRn
— SumanTV (@SumanTvOfficial) September 2, 2022