సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ఛానల్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ కి సెలబ్రిటీలు, సామాన్యులు అనే రూల్స్ లేవు కదా.. అందుకేనేమో మెల్లగా యూట్యూబ్ ద్వారా కూడా సంపాదించే పనిలో పడుతున్నారు. సినీ నటుల సంగతి పక్కన పెడితే.. సీరియల్ నటులు, యాంకర్స్, ఆర్టిస్టులు ఎక్కువగా యూట్యూబ్ ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అయితే.. యూట్యూబ్ లో అడిగేవారు లేరు కదా అని.. ఫ్రాంక్స్ అని, షాపింగ్ అని, హోమ్ టూర్స్.. మేకప్ కిట్, బీరువా టూర్, ఫ్రిడ్జి టూర్, ట్రావెలింగ్, పెళ్లిళ్లు, ఫంక్షన్స్ వ్లాగ్స్ అంటూ ఏది పడితే అది తోచిందల్లా వీడియో తీసి పెట్టేస్తున్నారు.
ఇప్పటికే బుల్లితెరకు సంబంధించి చాలామంది లేడీ సెలబ్రిటీలు రెగ్యులర్ గా వీడియోలతో కామెంట్స్, విమర్శలు ఎదుర్కొంటూనే కంటిన్యూ చేస్తున్నారు. యాంకర్ లాస్య, యాంకర్ శివజ్యోతి, నటి శ్రావణి.. ఇలా అందరూ ఈ మధ్య ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే.. వీరందరిలో నటి శ్రావణికి వాయిస్ పోయిందని.. ఇకపై మాట్లాడకపోవచ్చు అని అప్పట్లో ఆమె భర్త ఓ థంబ్ పెట్టి వీడియో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దీ రోజులకే శ్రావణికి వాయిస్ వచ్చేసిందని మరో వీడియో పోస్ట్ చేశాడు. ఇలాంటి ప్రయోగాలే చిరాకుగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ చేసిన ఓ వీడియో అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.
ప్రియాంకకి ఇంకా పెళ్లి కాలేదని అందరికి తెలుసు. కానీ.. ఆమె తాజాగా సీమంతం వీడియోని పోస్ట్ చేసింది. అదేంటీ పెళ్లి కాకుండా సీమంతం ఏంటి? అని అనుకోవచ్చు. ఇక్కడే ఓ ట్విస్ట్ పెట్టింది.. ఇదంతా జానకి కలగనలేదు సీరియల్ డ్రీమ్ సీక్వెన్స్ లో భాగంగా తనని ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు కనిపించాలని చెప్పారట. దీంతో సీమంతం అంటూ వీడియో పెట్టి.. ఉత్తుత్తే అని ఓ బ్లాంకెట్ బయటికి తీసి షాకిచ్చింది ఈ డ్రామా క్వీన్. ప్రెగ్నెన్సీ లేడీస్ ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పే వీడియోలో.. ఇలా కామెడీ చేసి విమర్శలు ఫేస్ చేస్తోంది ప్రియాంక. నీకు పెళ్లే కాలేదు.. అప్పుడే నీకు సీమంతం ఆలోచనలు వస్తున్నాయా? అంటూ సీరియస్ అవుతున్నారు నెటిజన్స్. ప్రెజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి నటి ప్రియాంక జైన్ సీమంతం వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.