రీతూ చౌదరి.. సీరియల్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే అటు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, స్పెషల్ ఈవెంట్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నిజానికి రీతూకి సీరియల్స్ వల్ల వచ్చిన ఫేమ్, నేమ్ కంటే కూడా జబర్దస్త్ లోకి అడుగుపెట్టాక వచ్చిన పాపులారిటీనే ఎక్కువ. అందం, అభినయం, అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. జబర్దస్త్ లో ఆమెపై వేసే పంచులు, ఆమె వేసే ఆటో పంచులు అన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవలే ఓ ఖరీదైన కారుని కూడా కొనుగోలు చేసింది.
రీతూ చౌదరి అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్‌లో తన డైలీ యాక్టివిటీస్, వెకేషన్స్ ఇలా అన్ని డీటెయిల్స్ పెడుతూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఉంటుంది. తాజాగా రీతూ చౌదరి పెట్టిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వైరల్ పిక్స్ రీతూ చౌదరి వైట్ టాప్, బ్లూ జీన్స్ షాట్ లో బీచ్ లో నిల్చుని ఫొటోకి ఫోజు ఇచ్చింది. వైరల్ అవుతున్న రీతూ చౌదరి ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.