‘జబర్దస్త్’ షోల్లో చాలామంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు. ఆటో పంచులు వేస్తూ ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేసే ఇతడి జీవితంలో చాలా కష్టాలున్నాయి. వాటివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటకీ.. కామెడీని మాత్రం వదులుకోలేదు. ఓవైపు అనారోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే, షోల్లో పాల్గొంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. అలాంటి పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఈ మధ్య బాగా క్షీణించింది! ఏకంగా నడవలేని స్థితికి వెళ్లాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు తన హెల్త్ పై అప్డేట్ ఇస్తూ తాజాగా మరో వీడియో పోస్ట్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’లో కమెడియన్ గా జర్నీ స్టార్ట్ చేసిన ప్రసాద్.. తన ఆటో పంచులతో బాగా ఫేమస్ అయ్యాడు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రాంప్రసాద్, గెటప్ శీను.. ఇలా ఎవరిపై అయినా సరే మొహమాటపడుకుండా పంచులు వేస్తుంటాడు. అలా అభిమానులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇతడికి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. ఆ విషయాన్ని ఏం దాచుకోకుండా చాలాసార్లు చెప్పాడు. తన హెల్త్ పైనే కామెడీ కూడా చేసేవాడు. ఓవైపు ప్రతి వారం డయాలసిస్ చేసుకుంటున్నప్పటికీ.. ఎప్పటిలానే షోల్లో కనిపించేవాడు. ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేవాడు.
ప్రసాద్ కి ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్ చాలా వరకు తెలుసు. కానీ రీసెంట్ గా ఓ రోజు షూటింగ్ నుంచి వచ్చి జ్వరంగా ఉందని భార్య సునీతతో చెప్పాడు. ఆ తర్వాత నడవలేని స్థితికి చేరుకున్నాడు. తీరా ఆస్పత్రికి వెళ్తే.. నడుము దగ్గర నుంచి ఎడమ మోకాలి వరకు చీము పట్టేసిందని డాక్టర్స్ చెప్పారు. దీంతో పూర్తిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తాన్ని కమెడియన్ నూకరాజు.. వీడియోగా తీసి పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్, అభిమానులు.. ప్రసాద్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెట్టారు.
ఇక ప్రసాద్ ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చిన నూకరాజు… యూట్యూబ్ లో తాజాగా మరో వీడియో పోస్ట్ చేశాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కాస్త కోలుకున్నాడని చెప్పాడు. కర్ర లేదంటే ఓ మనిషి సాయం తీసుకుని నడుస్తున్నాడని విజువల్ చూపించాడు. అలానే గత నాలుగైదు రోజుల నుంచి సెలైన్స్ ఎక్కిస్తున్నారని, అలానే మరో నాలుగు రోజులు కూడా ఇలానే చేయాల్సి ఉందని నూకరాజు చెప్పాడు. ఇక హాస్పిటల్ కి వెళ్లిన ప్రసాద్.. స్కానింగ్ కూడా చేసుకున్నాడు. మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ నడవగలిగే విషయం చెబుతామని డాక్టర్స్ చెప్పారు. మరోవైపు ప్రసాద్ పూర్తిగా రికవరీ అయిన తర్వాత మరో వీడియో కూడా చేసి పెడతానని నూకరాజు చెప్పాడు. తన హెల్త్ బాగుపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ప్రసాద్ ధన్యవాదాలు చెప్పాడు.