జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందికి జీవితంలో ఓ గుర్తింపు లభించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ వల్ల తినడానికి తిండి లేని స్థితి నుంచి నలుగురికి పెట్టే స్థాయికి మేము వచ్చాం అని ఎంతో కమీడియన్లు చెప్పడం చూశాం. అలాంటి వారిలో అదుర్స్ ఆనంద్ కూడా ఒకడు. జీవితంలో ఎన్నో కష్టాలు తర్వాత జబర్దస్త్ షో ద్వారా అవకాశాలు, గుర్తింపు సంపాదించాడు. జీవితంలో బాగా సెటిల్ కావడమే కాకుండా.. ప్రేమ వివాహం చేసుకుని పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నాడు. తాజాగా యాంకర్ సుమ క్యాష్ షోలో పాల్గొన్న ఆనంద్ దంపతులు.. తమ లవ్ స్టోరీ, వివాహం గురించి చెప్పొకొచ్చారు.
‘నాకు మంజుల ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యింది. నేను ప్రపోజ్ చేసినప్పుడు ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు ఫ్రెండ్ షిప్ వరకు అయితే ఓకే అని చెప్పింది. మనకు తెలిసిందే కదా.. అమ్మాయిలు ముందు ఫ్రెండ్ షిప్ అంటారు ఆ తర్వాత ప్రేమ అంటారు. అందుకే వదలకూడదని ఫ్రెండ్ షిప్ కు ఓకే చెప్పాను. రోజుకు ఒక రూ.50 రీఛార్జ్ చేసి సాయంత్రం మొత్తం మాట్లాడేవాడిని’.
‘నన్ను వదులుకోవడం ఇష్టం లేక, తల్లిందడ్రులను వదులుకోలేక చాలా కాలం నలిగిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు బస్ ఎక్కి నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు పట్టుకున్న చెయ్యి.. ఇప్పటి దాకా వదల్లేదు’ అంటూ ఆనంద్ తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. ఆనంద్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.