మెహర్ రమేష్ అంటే ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడిపోయింది. బిల్లా తప్పితే తీసిన మూడు సినిమాలు ప్లాప్ లే. కంత్రి, శక్తి, షాడో సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరస్ట్ పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించాయి. తారక్ తో తీసిన రెండు సినిమాలు తారక్ కెరీర్ లోనే భయంకరమైన అనుభవాన్ని మిగిల్చాయి. కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించినప్పటికీ కంటెంట్ పరంగా ఆ సినిమా ఎవరికీ ఎక్కలేదు. శక్తి సినిమా పరిస్థితి కూడా అంతే. దీంతో ఎన్టీఆర్, మెహర్ రమేష్ మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో ఎలా ఉన్నారో తెలియదు గానీ ఈ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా అయితే పడలేదు కదా. ఆంధ్రావాలా లాంటి ప్లాప్ తర్వాత టెంపర్ తో పూరీకి అవకాశం ఇచ్చారుగా తారక్. కథ పూరీది కాదు కాబట్టి ఇచ్చారంటారా? ఏమో వీరి మధ్య గ్యాప్ వచ్చిందో లేదో అనే ప్రశ్నకు మెహర్ రమేష్ సమాధానమిచ్చారు.
ప్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ కి.. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాతో మళ్ళీ మెగా ఫోన్ పట్టుకునే భాగ్యం దొరికింది. చిరంజీవితో భోళా శంకర్ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు మెహర్ రమేష్. ఈ సందర్భంగా ఆయన సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘మెహర్ రమేష్ ని బాగా నమ్మినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఫ్రెండ్ తో రెండు ప్లాప్ లు పడేసరికి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా? మీ బాండింగ్ ఎలా ఉంది? ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది?’ అని యాంకర్ అడుగగా.. దానికి మెహర్ రమేష్ ఈ విధంగా స్పందించారు.
‘కంత్రి హిట్ మూవీ అని, నేను చేసిన బడ్జెట్ కి, సినిమా బిజినెస్ కి కంత్రి సినిమా హిట్. అమెరికాలో కంత్రి సినిమా బాగా ఆడింది. యమదొంగ కంటే కంత్రి సినిమా అమెరికాలో బాగా ఆడింది. ఎన్టీఆర్ ని ఫస్ట్ టైమ్ ఒక స్టైలిష్ గా చూడడం, పాటలు గానీ అమెరికాలో ఉన్న వారికి బాగా నచ్చాయి. కంత్రి సినిమాలో లోపాలు ఉన్నా గానీ రిజల్ట్ పరంగా సిక్స్ రన్స్ కాదు గానీ ఫోర్ రన్స్ కొట్టింది’ అని అన్నారు. ఇక శక్తి గురించి మాట్లాడుతూ.. ‘చాలా వరకూ శక్తి సినిమా బాగా తీయడానికి ప్రయత్నించాను. కానీ సినిమా జనాలకి కనెక్ట్ కాలేదు. ఎన్టీఆర్ కి నచ్చే తీశాను. ఎన్టీఆర్ కి నచ్చకుండా సినిమా ఎవరూ తీయలేరు. అయితే శక్తి తర్వాత ఎన్టీఆర్ కి పరిణితి వచ్చింది’ అని మెహర్ రమేష్ అన్నారు.
దీంతో మెహర్ రమేష్, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందన్న విషయం స్పష్టమవుతుంది. అవును అది నిజమే. ఒకప్పుడున్న ఎన్టీఆర్ వేరు, ఇప్పుడున్న ఎన్టీఆర్ వేరు. కథల ఎంపిక విషయంలో ఎన్టీఆర్ కి ఇప్పుడున్న పరిణితి అప్పట్లో లేదేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కంత్రి, శక్తి లాంటి సినిమాలు రావడం లేదు. మరి భోళా శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టి.. ఎన్టీఆర్ కోసం ఒక కథ రెడీ చేసుకుని.. ఎన్టీఆర్ కెరీర్ లో గ్రహణం లాంటి కంత్రి, శక్తి సినిమాల ప్రభావాన్ని చెరిపేసేలా మెహర్ రమేష్ అద్భుతమైన కథ తీస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే శక్తి సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం తాను కాదని మెహర్ రమేష్ అన్నారు. ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. మెహర్ రమేష్ ఇంటర్వ్యూ చూసేందుకు ఈ కింది వీడియో చూడండి.