ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోహీరోయిన్.. విడాకులకు రెడీ అయ్యారట. దాదాపు 21 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నారట. ఇంతకీ కారణమేంటి? ఇందులో నిజమెంత?
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. మనకు కనిపించేది చాలావరకు నిజం కాదు. చాలావరకు ఆ కలర్స్, రిలేషన్స్ చూసి ఫ్యాన్స్ ఆహా ఓహో అని తెగ సంబరపడిపోతారు. అయితే ఇక్కడే కొన్ని చేదు విషయాలు కూడా కనిపిస్తుంటాయి. అవే కొంతకాలం మాత్రమే ఉండే రిలేషన్స్. అందరూ ఇలానే అని చెప్పాం కానీ కొందరు సెలబ్రిటీలు యాక్టర్స్ గా ఉన్నప్పుడు లవ్ లో పడతారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు లైఫ్ ని లీడ్ చేస్తారు. సడన్ గా విడాకుల వార్త చెప్పి షాకిస్తున్నారు. టాలీవుడ్ లో నాగచైతన్య-సమంత, తమిళంలో ధనుష్-ఐశ్వర్య విషయంలో ఇలానే జరిగింది. ఇప్పటికీ వీటి గురించి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో పేరు చేరనుందనే వార్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసేవాళ్లకు తలా అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది సంక్రాంతి టైంలో ‘తెగింపు’ అనే డబ్బింగ్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పర్వాలేదనిపించాడు. ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం బిజీ అయిపోయాడు. ఇలాంటి టైంలో అజిత్ విడాకులు తీసుకోబోతున్నాడనే న్యూస్.. ఫ్యాన్స్ తో పాటు చాలామంది ప్రేక్షకుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనిచేసింది. ఎందుకంటే 21 ఏళ్లుగా కలిసున్న ఈ స్టార్ కపుల్ ఇలా చేయబోతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కొన్నిరోజుల నుంచి అజిత్, అతడి భార్య షాలిని మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఇన్నాళ్లపాటు సర్దుకుపోయిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఆ విబేధాలు ఎక్కువయ్యావని అంటున్నారు. అందుకే ఈ డివోర్స్ న్యూస్ బయటకు వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఇదే టైంలో డైరెక్టర్ రమేష్ ఖన్నా చేసిన కామెంట్స్ అయితే వీటికి మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. ‘అజిత్,షాలినీ లవ్ చేసుకుంటున్న టైంలో నేను వద్దని చెప్పాను. అయినా సరే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. వారు విడిపోతారని నేనయితే అనుకోవడం లేదు. ఇన్నిరోజులు ఎలా అయితే గుట్టుగా సంసారం సాగిందో ఇప్పుడు అలానే సాగాలని కోరుకుంటున్నాను.’ అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్స్ కూడా హీరో అజిత్ విడాకుల వార్త నిజమేనని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.